సీఎం కేసీఆర్ కు ఒక ఆఫర్ ...రాజాసింగ్

సీఎం కేసీఆర్ కు ఒక ఆఫర్ ...రాజాసింగ్

15-04-2019

సీఎం కేసీఆర్ కు ఒక ఆఫర్ ...రాజాసింగ్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఒక ఆఫర్‌ ఇస్తున్నా. నేను టీఆర్‌ఎస్‌లో చేరడానికి సిద్ధం. అయితే.. అయోధ్యలో రామ మందిరం నిర్మాణంకోసం, గోవులను రక్షించేందుకు, మతమార్పిడులకు వ్యతిరేకంగా మేం చేస్తున్న ఉద్యమంలో మీరు కలిసి వస్తారా? అని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో శ్రీరామ శోభయాత్ర నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాజాసింగ్‌ మీడియాతో మాట్లాడారు. 10 నిమిషాల నుంచి 20 నిమిషాల పాటు తమకు సమయమిస్తే దేశంలోపలున్న దేశ ద్రోహులను తరిమికొడతామన్నారు. అయోధ్యలో భవ్య మందిర నిర్మాణం, అఖండ హిందూ రాష్ట్ర స్థాపనకు ప్రతి హిందువు కంకణబద్ధుడు కావాలని పిలుపునిచ్చారు. అయోధ్యలో పూర్తయిన తార్వాత కాశీ, మథరులోనూ మందిరాలను నిర్మిస్తామని సృష్టం చేశారు. నేడు దేశంలో జైశ్రీరామ్‌ అనడం కూడా మతపరమైనదిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. భారతమాతకీ జై.. మందేమాతరం అనడానికి సిగ్గుపడే వారికి దేశంలో ఉండే అర్హత లేదన్నారు.