ASBL NSL Infratech

రైతుబంధు ఇవ్వకుండా రైతులను మోసం చేస్తున్న సర్కార్: కేసీఆర్

రైతుబంధు ఇవ్వకుండా రైతులను మోసం చేస్తున్న సర్కార్: కేసీఆర్

రైతుబంధు సొమ్ము ఇవ్వకుండా కాంగ్రెస్ సర్కార్ రైతులను మోసం చేస్తోందని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మండిపడ్డారు. గత నెల 9వ తేదీనే రైతు బంధు సొమ్ము ఖాతాల్లో వేస్తానన్న సీఎం ఇప్పటికీ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. రైతుబంధు నాట్లు వేసేటప్పుడు ఇస్తారా..? లేక కోతలు కోసేటప్పుడు ఇస్తారా.? అని రేవంత్ రెడ్డిని నిలదీశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా  కరీంనగర్‌ జిల్లాలోని వీణవంకలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో ప్రసంగించిన కేసీఆర్.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘రైతుబంధు పోయిన నెల 9వ తారీకు లోపు రైతులందరి ఖాతాల్లో వేస్తానన్నారు కదా సీఎం రేవంత్ రెడ్డి. మరి మీ ఖాతాల్లో డబ్బులు పడ్డాయా? ఎవడన్నా రైతుబంధు నాట్లు వేసేటప్పుడు ఇస్తడా.. లేకుంటే కోతలు కోసేటప్పుడు ఇస్తడా..? పంటలు కోసుడు అయిపాయే.. పంట రానే వచ్చే.. ఇప్పుడు జోకుతుండ్రు కూడా. అయినా రైతుబంధు పైసలు రాకపాయె. ఇది కాంగ్రెస్ అసమర్థ పాలన కాక ఇంకేంది..? రైతుల నోళ్లు కొడుతున్న ఈ సర్కార్‌ను ఏమనాలి?’’ అంటూ కాంగ్రెస్ పాలనపై కేసీఆర్ ఫైర్ అయ్యారు. రైతుబంధు సొమ్ము ఇవ్వకుండా కాంగ్రెస్ సర్కార్ రైతులను వెన్నుపోటు పొడిచిందని కేసీఆర్ ధ్వజమెత్తారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :