ASBL NSL Infratech

ఆంధ్రాలో పథకాలకు బ్రేక్ వేసిన ఈసీ.. స్పందించిన జగన్..

ఆంధ్రాలో పథకాలకు బ్రేక్ వేసిన ఈసీ.. స్పందించిన జగన్..

ఏపీలో ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో పథకాల అమలు విషయంలో ఈసీ బ్రేక్ వేయడం జరిగింది. 2019 ఎన్నికల సమయంలో కంటే కూడా ఇప్పుడు ఈసీ వైఖరి చాలా భిన్నంగా ఉంది అని వైసీపీ ప్రశ్నిస్తోంది.2 019 ఎన్నికలకు ముందు చంద్రబాబు పసుపు- కుంకుమ పథకం అమలులోకి తెచ్చారు. నా పథకం కేవలం ప్రజలకు మభ్యపెట్టి ఓట్లు తెచ్చుకోవడం కోసమే అన్న విషయం అందరికీ తెలుసు. కానీ అప్పట్లో ఆ పథకంపై ఈసీ ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. నిధుల విడుదల విషయంలో కూడా ఎటువంటి ఆంక్షలు పెట్టలేదు. కానీ ఇప్పుడు మాత్రం వైసీపీ ఆచరిస్తున్న పథకాలన్నీ నిధుల విడుదల విషయం లో ఈసీ నో చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. ఎలక్షన్ కోడ్ రావడానికి ముందే ఆసరా, విద్యాదీవెన లాంటి పథకాలకు జగన్ బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. అప్పుడు సుమారు 70% మంది నిధులు జమ చేయడం జరిగింది. వారి ఖాతాలలోకి డబ్బులు జమ చేసే విషయంలో టిడిపి ఫిర్యాదు కు ఈసీ స్పందించే నిధులకు బ్రేక్ వేసింది. ఎన్నికలు పూర్తయ్యటంతవరకు నిధులు విడుదల ఆపాలని ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిణామంపై తాజాగా స్పందించిన జగన్.. జరుగుతున్నది చూస్తుంటే ఎన్నికలు సజావుగా సాగుతాయా లేదా అన్న అనుమానం కలుగుతోంది అని పేర్కొన్నారు. ఇష్టానుసారంగా అధికారులను బదిలీ చేయడం.. ప్రభుత్వ పథకాల నిధులు ఆపేయడం.. ఇవన్నీ కుట్రపూరిత చర్యలుగా కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :