ASBL NSL Infratech

అక్కడికి వెళ్తే.. ఇంటికి తిరిగి వెళ్లినట్టుగా ఉంటుంది : సునీతా విలియమ్స్

అక్కడికి వెళ్తే.. ఇంటికి తిరిగి వెళ్లినట్టుగా ఉంటుంది : సునీతా విలియమ్స్

భారత సంతతికి చెందిన అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ మూడోసారి రోదసీ యాత్రకు సిద్ధమయ్యారు. బోయింగ్‌ సంస్థకు చెందిన స్టార్‌లైనర్‌ వ్యోమనౌకలో అంతరిక్షయానం చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం మే 7 ఉదయం 8:04 గంటలకు ఈ వ్యౌమనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇందులో ఆమె మిషన్‌ పైలట్‌గా వ్యవహరించనున్నారు. ఈ క్రమంలో సునీత మాట్లాడుతూ గణేశుడు నా గుడ్‌ లక్‌ ఛార్మ్‌. విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని తీసుకువెళతాను. నేను ఆధ్మాత్మిక వాదిని. అలాగే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్తుంటే ఇంటికి తిరిగి వెళ్తున్నట్టుగా ఉంటుంది అని వెల్లడించారు. 

అమెరికా అంతరిక్ష సంస్థ `నాసా వాణిజ్య కార్యక్రమంలో భాగంగా స్టార్‌లైనర్‌కు ఇది మొదటి మానవసహిత యాత్ర. దీని గురించి కాస్త ఆందోళగానే ఉన్నా, గాబరా పడిపోయే పరిస్థితి ఏమీ లేదన్నారు. అలాగే అమెకు స్పేస్‌లో సమోసాను ఆస్వాదించడమేంటే ఇష్టమట. ఆమె ఒక మారథాన్‌ రన్నర్‌. ఐఎస్‌ఎస్‌లో ఓసారి మారథాన్‌ కూడా చేశారు. నాసా తన కమర్షియల్‌ క్రూ ప్రోగ్రామ్‌లో భాగంగా తొలి మానవ సహిత స్పేస్‌క్రాఫ్ట్‌ను అంతరిక్షంలోకి పంపేందుకు సిద్ధమైంది. ఇందులో సునీతా విలియన్స్‌తో పాటు మరో వ్యోమగామి బచ్‌ విల్‌మోర్‌ అంతరిక్ష యానం చేయనున్నారు. ఈ రాకెట్‌లో వీరిద్దరూ ప్రయాణించి, ఐఎస్‌ఎస్‌కు చేరుకొని, అక్కడ వారం రోజుల పాటు ఉండనున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :