ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

రివ్యూ : 'ఊరు పేరు భైరవకోన'

రివ్యూ : 'ఊరు పేరు భైరవకోన'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థలు : ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్
నటి నటులు : సందీప్ కిషన్, కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ, వెన్నెల కిషోర్, హర్ష చెముడు, పి. రవిశంకర్ తదితరులు  
సంగీతం: శేఖర్ చంద్ర, సినిమాటోగ్రఫీ : రాజ్ తోట
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్: ఎ రామాంజనేయులు
మాటలు : భాను భోగవరపు, నందు సవిరిగాన
సహ నిర్మాత: బాలాజీ గుత్తా, సమర్పణ: అనిల్ సుంకర
నిర్మాత: రాజేష్ దండా, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విఐ ఆనంద్
విడుదల తేదీ : 16.02.2024
నిడివి : 2 ఘంటల 16 నిముషములు

ఈ మద్య హర్రర్, థ్రిల్లర్ మూవీస్ కు మంచి ఓపెనింగ్స్ ఉంటున్నాయని తమిళ్, కన్నడ, మలయాళం మరియు తెలుగులో కూడా చాలా చిత్రాలు వస్తున్నాయి. హీరో
అదే పంధా లో సందీప్ కిషన్ లేటెస్ట్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. సందీప్ కిషన్‌ మంచి యాక్టర్ అయినా కూడా తన స్థాయికి తగ్గ విజయం ఇటీవల విడుదల అయిన చిత్రాలకు మాత్రం దక్క లేదు. మంచి కాన్సెప్ట్‌లతో కొత్త కథలతో ప్రయత్నిస్తున్నాడు కానీ వాటి ఫలితం మాత్రం ఎక్కడో తేడా కొడుతుంటుంది. ఇక ఇప్పుడు ఊరు పేరు భైరవకోన అంటూ అందరినీ ఆకట్టుకునేందుకు ఈ రోజు మన ముందుకు వచ్చాడు. ఈ చిత్రం టీజర్, ట్రైలర్ అందరినీ బాగానే ఆకట్టుకున్నాయి. దర్శకుడిగా వీఐ ఆనంద్‌కు, హీరోగా సందీప్ కిషన్‌కు ఈ చిత్రం ఏ మేరకు కలిసి వచ్చిందో ఓ సారి చూద్దాం.

కథ :

బసవ (సందీప్ కిషన్) తన స్నేహితుడు జాన్ (వైవా హర్ష)తో కలిసి ఓ దొంగతనం చేస్తాడు. కాత్యాయని (సత్య) పెళ్లి జరుగుతుండగా.. అరవై లక్షల విలువైన బంగారు నగల్ని దొంగిలిస్తాడు. ఈ క్రమంలో పోలీసుల నుంచి తప్పించుకుంటూ అనుకోకుండా భైరవకోన అనే ఊరిలోకి వస్తారు. ఐతే, ఈ ఇద్దరూ తప్పించుకుంటున్న క్రమంలో గీత (కావ్యా థాపర్) వీరి వద్ద ఉన్న నగల్ని దొంగిలించేందుకు ప్లాన్ చేస్తుంది. యాక్సిడెంట్ అయినట్టుగా నాటకం ఆడుతుంది. అది తెలియని బసవ ఆమెను హాస్పిటల్‌లో జాయిన్ చేయాలని సాయం చేస్తాడు. ఈ క్రమంలో పోలీసులు ఈ కారును వెంబడిస్తుంటారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బసవ తన కారుని భైరవకోనలోకి పోనిస్తాడు. భైరవ కోనలోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత బసవ కారు, అతను దొంగిలించిన నగలు మాయం అవుతాయి. అసలు ఈ నగల ఫ్లాష్ బ్యాక్ ఏంటి? భూమి (వర్ష బొల్లమ్మ) కోసం బసవ ఈ దొంగతనాలు ఎందుకు చేస్తాడు? పచ్చ గూడెం కథ ఏంటి? రాజప్ప (రవి శంకర్) ఎవరు? ఈ భైరవకోన ఊర్లోని వింతల వెనుకున్న రహస్యాలేంటి? భైరవకోనలోకి ప్రవేశించడమే తప్పా.. బయటకు వెళ్లడం కుదరదు. అలాంటి ఊర్లో చిక్కుకున్న బసవ బయటకు ఎలా వస్తాడు? అన్నది థియేటర్లో చూడాల్సిందే.

నటి నటుల హావభావాలు :

హీరోగా నటించిన సందీప్ కిషన్ తన పాత్రకు తగ్గట్లు బాగానే నటించాడు. అతని కోణంలో చూసుకుంటే ఇది చాలా పెద్ద చిత్రమే (విజయమే) అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రేంజ్‌లో సందీప్ కనిపించి చాలా కాలమే అయింది. సందీప్ కిషన్ తన నటనను, కామెడీ యాంగిల్‌ను, యాక్షన్‌ను మరోసారి చూపించి అందరినీ ఆకట్టుకుంటాడు. స్క్రీన్ మీద చాలా చక్కగా కనిపించాడు. హీరోయిన్ పాత్రలు మరీ అంత ముఖ్యమైనవి కాదేమో అనిపిస్తుంది. ఉన్నంతలో వర్ష బొల్లమ్మ ఆకట్టుకుంటుంది. కావ్యా థాపర్‌కి సరైన స్పేస్ దక్కలేదనిపిస్తుంది. హర్ష, వెన్నెల కిషోర్ కామెడీ బాగుంటుంది. రాజప్పగా రవి శంకర్ ఆకట్టుకుంటాడు. బ్రహ్మాజీ, సరయు ఇలా చాలా పాత్రలకు సరైన గుర్తిపు లేదు. కానీ మిగతా అందరూ తమ తమ పాత్రల్లో ఆకట్టుకుంటారు.

సాంకేతిక వర్గం పనితీరు :

ఫ్లాష్ బ్యాక్ సీన్లు, ప్రజెంట్ సీన్లు అంటూ ఏదో జరుగుతోందనే ఆసక్తిని రేకెత్తించేలానే వీఐ ఆనంద్ తన సినిమాను ముందుకు తీసుకెళ్లాడు. కామెడీ సీన్లు కూడా వర్కౌట్ అయ్యాయి. కొన్ని చోట్ల భయపెట్టేలా కూడా చేశాడు. కానీ హారర్ థ్రిల్లర్ సినిమాలు చూసిన వారికి ఇది  మాములే అనిపించొచ్చు. సినిమాలో చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా.. కథనం ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు. ఇక సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర సమకూర్చిన పాటలు పర్వాలేదు. ప్రధాన బలం బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్. ఈ రెండూ కూడా థియేటర్లో ప్రేక్షకుడ్ని కూర్చోబెట్టేస్తాయి. ఇక విజువల్స్, వీఎఫ్ఎక్స్ ఈ సినిమాకు ప్రధాన బలం. మాటలు కొన్ని చోట్ల బాగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎడిటింగ్ ఓకే అనిపిస్తుంది.  సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకున్నాయి. కెమెరామెన్ రాజ్ తోట సీన్స్ ను తెరకెక్కించిన విధానం బాగుంది. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ కూడా పర్వాలేదు. సినిమా మాత్రం గ్రాండియర్‌గా కనిపిస్తుంది. ఈ చిత్ర నిర్మాత రాజేశ్‌ దండా పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. పెట్టిన ప్రతీ పైసాకు తగ్గ ప్రతిఫలం వచ్చినట్టుగా అనిపిస్తుంది.

విశ్లేషణ :

భైరవకోన మెయిన్ పాయింట్ చూసుకుంటే చాలా పాతదే. నేల.. ఆ నేల మీద కన్నేసిన ఒకడు.. ప్రజల్ని అక్కడి నుంచి తరలించడం.. ఆ భూమి కోసం మళ్లీ పోరాడటం.. అనేది అండర్ లైన్‌గా చూపించే పాయింట్. కానీ ఈ పాయింట్‌కు తన ఊహాశక్తితో వీఐ ఆనంద్ భైరవకోన అనే ఓ ఊరుని సృష్టించాడు. దానికి గరుడపురాణం అనే పెద్ద లింక్ పెట్టాడు. ఫస్ట్ హాఫ్ కాస్త ఇంట్రెస్టింగ్‌గా, ఎంగేజింగ్‌గా సాగుతుంది. ఇలాంటి థ్రిల్లర్, సస్పెన్స్ మూవీస్ ఒకసారి చూడటానికి మాత్రం బాగుంటాయి. మళ్లీ మళ్లీ చూడాలనే ఆసక్తి మాత్రం కలిగించవు. అలా మళ్లీ మళ్లీ చూడాలనే ఇంట్రెస్ట్ కలిగించే చిత్రాలు చాలా తక్కువగా వస్తుంటాయి. ఈ భైరవకోన కూడా ఓ సారి చూడాలనిపించే చిత్రంగానే వుంది. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :