ASBL NSL Infratech

చిరంజీవి గారు మీ ఇంట్లో గొడవలు లేవా? ..అంబటి రాంబాబు

చిరంజీవి గారు మీ ఇంట్లో గొడవలు లేవా? ..అంబటి రాంబాబు

ఈరోజు సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబుకు ఓటు వేయొద్దని అతని అల్లుడు పెట్టిన వీడియో ఎంత కలకలం సృష్టించిందో అందరికీ తెలుసు. దీనిపై స్పందించిన అంబటి అతని అల్లుడి గురించి ఇప్పటివరకు ఎవరికీ తెలియని విషయాలను వెల్లడించారు. రేపు 13న పోలింగ్ జరుగుతుంది అనగా ఇప్పుడు నా అల్లుడు.. నేనొక దుర్మార్గుడ్ని, దుష్టుడ్ని.. నాకు ఓటు వేయొద్దు అంటూ వీడియో పెట్టాడు. నా అల్లుడు లాగే నా కూతురు కూడా ఒక డాక్టర్.. అయితే ఆ ఇద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు. గతంలో కూడా గౌతమ్ ఎన్నోసార్లు నేను చంద్రబాబుని కలుస్తాను.. పవన్ కళ్యాణ్ ని కలుస్తాను అని ప్రస్తావించి ఉన్నాడు. ఇక ఆ విషయం పక్కన పెడితే నాలుగేళ్ల కిందట అతడు నా కూతుర్ని అర్ధాంతరంగా వదిలేశాడు. అప్పటినుంచి నా బిడ్డనే కాదు అతని బిడ్డల్ని కూడా నేనే సంరక్షిస్తున్నాను.

అలాంటి నన్ను ఈరోజు అతను నీచుడు అంటే.. దాన్ని మీరు నమ్ముతారా. ఈరోజు మాట్లాడింది నా అల్లుడు మాత్రమే అయితే నేను అస్సలు పట్టించుకునే వాడిని కాదు..  మాట అతనిది కానీ దాని వెనుక ఉన్న గొంతు పవన్ కళ్యాణ్ ది అని నాకు బాగా తెలుసు. ఎల్లో మీడియా ఈ విషయాన్ని పదే పదే హైలెట్ చేసి ప్రచారం చేస్తుంది. ఒక కుటుంబ విషయాన్ని ఇలా రచ్చ కీడ్చి ఏం రాజకీయం చేయాలనుకుంటున్నారు? నేను ఇలాగే మాట్లాడాలి అనుకుంటే.. ఎవరి కుటుంబాల్లో గొడవలు లేవా? అని ప్రశ్నించారు. అంతేకాదు చిరంజీవిని ఉద్దేశించి మాట్లాడుతూ.. చిరంజీవి గారు మీ ఇంట్లో ఎటువంటి గొడవలు లేవా? మీ కూతురు జీవితంలో సమస్యలు లేవా? నాగబాబు గారి కూతురు జీవితంలో సమస్యలు లేవా? కానీ నేను ఏనాడైనా మీ విషయాల గురించి మాట్లాడానా.. అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :