ASBL NSL Infratech

రివ్యూ : తెలుగు సూపర్ హీరో 'హను-మాన్'

రివ్యూ : తెలుగు సూపర్ హీరో 'హను-మాన్'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
నిర్మాణ సంస్థ : ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్
నటీనటులు: తేజ సజ్జ, వరలక్ష్మి శరత్‌కుమార్, అమృత అయ్యర్, వినయ్ రాయ్,
సముద్రఖని, వెన్నెల కిషోర్, రాజ్ దీపక్ శెట్టి, గెటప్ శ్రీను, సత్య
సంగీత దర్శకులు: గౌర హరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్
సినిమాటోగ్రఫీ: శివేంద్ర, ఎడిటింగ్: సాయిబాబు తలారి
నిర్మాత: నిరంజన్ రెడ్డి కందగట్ల
కథ - దర్శకుడు : ప్రశాంత్ వర్మ
విడుదల తేదీ : 12.01.2024
నిడివి : 2 ఘంటల 38 నిమిషములు

సంక్రాంతి సినిమాలు అనగానే అగ్ర హీరోల చిత్రాలే విడుదల అవుతాయి, అలాంటిది ఈ పండక్కి పోటీపడుతూ సంక్రాంతిబరిలో నిలిచి అందరి దృష్టి ఆకర్షించింది పాన్ ఇండియా మూవీ   'హను-మాన్'. తేజా సజ్జా కథానాయకుడిగా, ప్రశాంత్ వర్మ రూపొందించిన సూపర్ హీరో చిత్రం ఈ రోజు విడుదల అయ్యింది.  చిన్న హీరో చిత్రమైనా భారీ బడ్జెట్ తో రెండు సంవత్సరాలుగా షూటింగ్ జరుగుతున్న గ్రాఫిక్స్ చిత్రం ఇది. మరి పెద్ద చిత్రాలకు ధీటుగా నిలబడిందా? లేదా? సూపర్ హీరో హనుమాన్ సాహసాలు ప్రేక్షకుడిని ఏ మేరకు అకట్టుకున్నాయోసమీక్షలో చూద్దాం!

కథ :

సౌరాష్ట్ర ప్రాంతానికి చెందిన మైఖేల్(వినయ్ రాయ్) తన చిన్ననాటి నుంచి సూపర్ హీరోస్ విషయంలో చాలా ప్రభావవంతం అయ్యి తాను కూడా ఒక సూపర్ హీరో కావాలని కోరుకుంటాడు. అందుకు అడ్డువస్తున్నారని చిన్నతనంలోనే  తల్లి దండ్రులను సైతం చంపేస్తాడు. ఆ తర్వాత పలువిధాలుగా సూపర్ హీరో కావాలని రకరకాలుగా ప్రయోగాలు చేస్తుంటాడు. కానీ ఒక్క ప్రయత్నం కూడా ఫలించదు. దీంతో అసలు సిసలైన సూపర్ పవర్స్ కోసం అన్వేషిస్తాడు. కట్ చేస్తే... అంజనాద్రి పల్లెటూరు, ఆ ఊరి పాలెగాడు గజపతి (దీపక్ శెట్టి) అతని ఆకృత్యాలు మధ్య పల్లె నలిగిపోతుంటుంది. అతన్ని ఎదిరించినవాడిని బలమైన ఫహల్వాన్ తో కుస్తీ పోటీ పెట్టి మట్టు పెడుతుంటాడు. ఆ కుగ్రామం లో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ తిరిగే తుంటరి కుర్రాడు హనుమంతు(తేజ సజ్జ)ని  తల్లి దండ్రులు లేకపోవడంతో అక్క అంజమ్మ (వర లక్ష్మి శరత్ కుమార్) అతన్ని పెంచి పెద్ద చేస్తుంది.  కొన్ని పరిణామాల రీత్యా భజరంగ్ హనుమాన్ శక్తులని పొందుతాడు. మరి తాను ఈ శక్తిని ఎలా పొందగలిగాడు? అసలు ఆ శక్తి భూమిపై ఎలా నిక్షిప్తం అయ్యి ఉంది? మరి ఈ శక్తి కోసం మైఖేల్ ఎలా తెలుసుకొని వస్తాడు?  విభీషణుడు (సముద్ర ఖణి) పాత్ర ఏంటి? మీనాక్షి (అమృత అయ్యర్) వలన హనుమంతు కు ఏవిధంగా ఉపయోగం జరుగుతుంది? భారతదేశ ఇతిహాసాల సంబంధం ఎలా ఉంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్నిథియేటర్లలో  చూడాల్సిందే.

నటీనటుల హావభావాలు:

అతి పెద్ద మేజర్ ప్లస్ పాయింట్ హనుమంతుడే! దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎలా హైలైట్ చేయాలో తేజ సజ్జను అలా చేసి చూపించాడు. హీరోగా  తేజ సజ్జ ఓ సామాన్య కుర్రాడిలా తన రోల్ కి కంప్లీట్ ప్రాణం పెట్టేసాడు. తన రోల్ ని చాలా ఈజ్ గా బాధ్యతగా చేసి చూపించాడు అలాగే తన లుక్స్ కానీ కామెడీ టైమింగ్ గాని యాక్షన్ పార్ట్ సహా ఎమోషనల్ పెర్ఫెమెన్స్ లతో కూడా అదరగొట్టాడు. ఇక హీరోయిన్ అమృత అయ్యర్ కి కూడా ఈ చిత్రంలో మంచి పాత్ర చేసింది. హీరోతో ట్రావెల్ చేస్తూ బ్యూటిఫుల్ లుక్స్ తో ఆకట్టుకుంది. వీరితో పాటుగా వరలక్ష్మి శరత్ కుమార్ చాలా పవర్ఫుల్ రోల్ లో కనిపించారు. చాలా నాచురల్ పెర్ఫామెన్స్ కనబరిచింది. మెయిన్ గా తేజతో ఎమోషనల్ సీన్స్ లో ఇద్దరి పెర్ఫామెన్స్ లు ఆకట్టుకుంటాయి. ఇక వీరితో పాటుగా వెర్సటైల్ నటుడు సముద్రఖని రోల్ అయితే సినిమాలో ఆశ్చర్యపరుస్తుంది. తన రోల్ లో కూడా తాను పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. ఇంకా విలన్ గా వినయ్ రాయ్ కూడా క్లీన్ గా కనిపిస్తారు.  గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్, కమెడియన్ సత్య వారిపై కామెడీలు హిలేరియస్ గా వర్కౌట్ అయ్యాయి.

సాంకేతిక వర్గం పనితీరు:

ఇక దర్శకుడు ప్రశాంత్ వర్మ విషయానికి వస్తే తన విజన్ కి మాత్రం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. కాకపోతే సూపర్ హీరో జానర్ అయినప్పటికీ కొన్ని సీన్స్ ని మనం ఆల్రెడీ చూసినవే చూపించాడు. కానీ ఇక్కడ తాను ప్రస్తుత కాలానికి మన ఇతిహాసాన్ని జోడించడంలో మాత్రం తాను సూపర్ సక్సెస్ అయ్యాడు. హనుమాన్ ఫ్యాక్టర్ ని ఎలివేషన్స్ ని క్లైమాక్స్ పోర్షన్ ని తాను ప్రెజెంట్ చేసిన విధానం చూస్తే రానున్న రోజుల్లో తన సినిమాలకి మరింత బడ్జెట్ ఇస్తే ఇంకా సాలిడ్ విజువల్స్ ఇస్తాడని చెప్పవచ్చు. కానీ ఇంకా కొన్ని లాజిక్స్ ని  సరిచేసుకొని యాక్షన్ సీక్వెన్స్ లను మరింత నాచురల్ గా ప్రెజెంట్ చేయాల్సింది. గౌరీ హరీష్, అనుదీప్ దేవ్లా సంగీతం సినిమాలో నెక్స్ట్ లెవెల్లో ఉంది. మెయిన్ గా తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సినిమాకి వెన్నుముకగా నిలిచాడు. ఈ తరహా చిత్రాల్లో రాజమౌళికి కీరవాణి సంగీతం అందిస్తే ఎలా ఉంటుందో అలాగే ప్రశాంత్ వర్మకి గౌరీ హరీష్ అనే లెవెల్లో ఉంది. ఇంకా ఎడిటింగ్, డైలాగ్స్ కూడా బాగున్నాయి. శివేంద్ర సినిమాటోగ్రఫి బాగుంది. భారీ విజువల్స్ ని తాను చూపించారు.  చిత్రంలో నిర్మాణ విలువలు అద్భుతంగా వున్నాయి. పెట్టిన బడ్జెట్ కి అయితే చాలా వరకు న్యాయమైన విజువల్స్ కనిపించాయి.  వి ఎఫ్ ఎక్స్ చాలా చోట్ల చాలా నాచురల్ గా చూపించారు కానీ కొన్ని చోట్ల బడ్జెట్ మూలాన కాంప్రమైజ్ అయ్యి ఉండొచ్చు.

విశ్లేషణ:

ఓ సామాన్యుడికి అద్వితీయమైన శక్తులు వచ్చి సూపర్ హీరో అవటం, వాటిని దక్కించుకోడానికి విలన్ ప్రయత్నించడం, ఈ నేపధ్యం లో ప్రజలకు ముప్పు ఏర్పడటం, ఆ క్రమం లో సూపర్ హీరో ఆ ఉపద్రవం నుండి కాపాడటం వంటివి హాలీవుడ్ చిత్రాలనుండి... ప్రతీ చిత్రాలలో ఇంచుమించు ఇదే కోవలో ఉండటం జరుగుతుంది. ఈ 'హను-మాన్' సూపర్ హీరో కథ కూడా అదే మాదిరిగా ఉంటుంది. ఆ విధంగా మన తెలుగు నుంచి వచ్చిన ఈ మొదటి సూపర్ హీరో చిత్రం “హను మాన్”. ప్రేక్షకుడి    అంచనాలు రీచ్ అయ్యింది అని చెప్పవచ్చు. మెయిన్ లీడ్ లో ఉన్న నటీనటులు అంతా కూడా సాలిడ్ పెర్ఫామెన్స్ లు కనబరిచారు. అలాగే దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ ఫ్యాక్టర్ ని ప్రెజెంట్ చేసిన విధానం, మన ఇతిహాసాన్ని జోడించడం ఇంప్రెస్ చేస్తుంది. కొన్ని లాజిక్స్ కొన్ని చోట్ల గ్రాఫిక్స్ ని పక్కన పెడితే ఈ భారీ చిత్రం సంక్రాంతి కానుకగా అందరికీ మంచి ట్రీట్ ఇస్తుంది. పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేస్తారు.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :