ASBL NSL Infratech

గోల్డీ బ్రార్ బతికే ఉన్నాడు.. అమెరికా పోలీసులు

గోల్డీ బ్రార్ బతికే ఉన్నాడు.. అమెరికా పోలీసులు

భారత్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్‌ గోల్డీ బ్రార్‌ అమెరికాలోని కాలిఫోర్నియాలో హత్యకు గురయ్యాడన్న ప్రచారాన్ని అక్కడి పోలీసులు ఖండించారు. వాస్తవానికి ఆ ఘటనలో చనిపోయిన వ్యక్తి వివరాలను గుర్తించిన తర్వాత ఈ ప్రకటన చేశారు. అమెరికాలోని హోల్ట్‌అవెన్యూలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతడు  కెనడా కేంద్రంగా పనిచేసే గ్యాంగ్‌స్టర్‌ గోల్డీ బ్రార్‌గా స్థానిక మీడియా పేర్కొంది. చివరికి ఫ్రెస్నో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. మృతుడు గోల్డీ బ్రార్‌ కాదని లెఫ్టినెంట్‌ విలియం జే డూలే వెల్లడించారు. మీరు ఆన్‌లైన్‌లో ప్రచారం నమ్మి మృతుడు గోల్డీ బ్రార్‌ అనుకుంటే కచ్చితంగా తప్పే. అది పూర్తి అవాస్తవం. మా డిపార్ట్‌మెంట్‌కు ప్రపంచం నలుమూలల నుంచి ఎంక్వైరీలు వస్తున్నాయి. అసలు ఇలాంటి వదంతులు ఎలా మెదలయ్యాయో తెలియదు. ఈ కాల్పుల ఘటనలో మరణించింది 37 ఏళ్ల జేవియర్‌ గాల్డ్నె అని వెల్లడించారు.

గోల్డీ బ్రార్‌గా ప్రచారంలో ఉన్న సతీందర్‌ సింగ్‌ భారత్‌లో మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్‌. అతడు లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌లో అత్యంత కీలకమైన సభ్యుడు. 2022లో జరిగిన సిద్దూ మూసేవాల హత్య కేసులో ఒక్కసారిగా ఇతడి పేరు  మార్మోగింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :