ASBL NSL Infratech

అధికారంతో విర్రవీగితే కేసీఆర్‌కు పట్టిన గతే: రేవంత్‌కు డీకే అరుణ వార్నింగ్

అధికారంతో విర్రవీగితే కేసీఆర్‌కు పట్టిన గతే: రేవంత్‌కు డీకే అరుణ వార్నింగ్

అధికారంతో విర్రవీగితే కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్‌కు కూడా పడుతుందని బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ హెచ్చరించారు. ఏదో అదృష్టవశాత్తు రేవంత్‌ సీఎం అయ్యారని ఎద్దేవా చేశారు. మహబూబ్‌నగర్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన డీకే అరుణ ఈ వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ రెడ్డి స్థాయి మరిచి తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని, తనను అవమానించేలా దూషణలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఉమ్మడి పాలమూరు జిల్లా కోసం ఏం చేశారో, చేస్తారో చెప్పకుండా వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని హితవు పలికారు. ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా పాలమూరు-రంగారెడ్డిపై ముఖ్యమంత్రి సమీక్ష ఎందుకు జరపలేదు? ఎన్నికల ముందు ఇచ్చిన మెగా డీఎస్సీ హామీ ఏమైంది? టెట్, డీఎస్సీ రుసుములు ఎందుకు పెంచారు?’’ అంటూ సీఎం రేవంత్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు డీకే అరుణ. అంతేకాకుండా ఎన్నికల వేళ ప్రజలకిచ్చిన హామీలను సీఎం ఎక్కడా ప్రస్తావించడం లేదని, కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు మళ్లీ కొత్త కొత్త మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :