ASBL NSL Infratech

రాయి అయినా రప్పైనా.. కాదేది రాజకీయాలకి అనర్హం.. ఇదే జనసైనికుల మనస్తత్వం..

రాయి అయినా రప్పైనా.. కాదేది రాజకీయాలకి అనర్హం.. ఇదే జనసైనికుల మనస్తత్వం..

పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో మెగా హీరోలు ఒకరి తర్వాత ఒకరు అతని తరుపున ప్రచారం చేయడానికి ముందుకు ఈ నేపథ్యంలో మేనమామ కోసం సాయిధరమ్ తేజ ఆదివారం పిఠాపురంలో ప్రచారం నిర్వహించారు. అయితే అనుకోకుండా ఈ ప్రచారంలో ఓ ఉద్రిక్త సంఘటన చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని గొల్లప్రోలు మండలం.. తాటిపర్తి ప్రాంతంలో గుర్తుతెలియని ఒక వ్యక్తి రాయి విసరడంతో జనసేన కార్యకర్తకు గాయమైంది. సరిగ్గా సాయిధరమ్ తేజ కాన్వాయ్ ముందుకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ సంఘటన కారణంగా తాటిపర్తి గ్రామానికి చెందిన నల్లల శ్రీధర్ అనే జనసేన కార్యకర్త తీవ్రంగా గాయపడ్డాడు. రాయి విసిరింది ఎవరో తెలియదు.. అది ఎలా వచ్చి తగిలిందో తెలియదు.. కానీ మొత్తానికి కారణం మాత్రం వైసీపీ కార్యకర్తలు అని జన సైనికులు గోల చేస్తున్నారు. సోమవారానికల్లా నిందితులను అరెస్టు చేయకపోతే కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయం.. గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ లను ముట్టడి చేస్తామని బెదిరిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో వీలైనంతగా మనం ప్రశాంతత మెయింటైన్ చేయాలి. అలాంటిది ఇటువంటి సమయంలో ఇలాంటి చిల్లరి అల్లర్లను ప్రోత్సహించడం మంచి పద్ధతి కాదు. అయినా ఈసారి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో గులకరాయి ప్రధాన పాత్ర పోషిస్తుందేమో అనిపిస్తుంది. జగన్ తో మొదలైన ఈ రాయి చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ ని దాటుకొని ఇప్పుడు సాయి ధరమ్ తేజ వరకు వచ్చింది.. మరి ఇంకెందరిని తాకుతుందో చూడాలి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :