ASBL NSL Infratech

తెలంగాణ లో అన్నదాతలు రోడ్డు ఎక్కడానికి కాంగ్రెస్ వైఫల్యమే కారణం.. బీఆర్ఎస్‌

తెలంగాణ లో అన్నదాతలు రోడ్డు ఎక్కడానికి కాంగ్రెస్ వైఫల్యమే కారణం.. బీఆర్ఎస్‌

తెలంగాణలో కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత అన్నదాతల జీవితాలు రోడ్డున పడుతున్నాయి. ఎన్నో కష్టాలకు ఓర్చి ..తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని.. పండించిన పంట గిట్టుబాటు ధర కూడా లేకుండా.. కొనేవారు లేక అన్నదాతలు అష్ట కష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తమ ధాన్యం ప్రభుత్వం కొనాలి అంటూ యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జూలూరులో అన్నదాతలు రోడు ఎక్కారు. చౌటుప్పల్-జూలూర్ రహదారిపై కంచ వేసి మరి తమ పంటను కొనాలి అని నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలోని ఐకెపి (IKP) సెంటర్ లో వారం రోజులుగా ధాన్యం కొనకపోవడంతో రైతులు తమ ఆగ్రహాన్ని ఇలా వ్యక్తం చేశారు. అకాల వర్షాల కారణంగా తమ ధాన్యమంతా తడిచిపోవడంతో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నామని.. ధాన్యం కొనుగోలు జరిపే అంతవరకు ఆందోళన వీడమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల ధర్నా కారణంగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో కలగజేసుకున్న పోలీసులు రైతుల ధర్నా ఆపించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్‌ పార్టీ రేవంత్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఏర్పడిన 5 నెలలలోనే కాంగ్రెస్ అసమర్ధ పాలన బయటపడిందని.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :