ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

రివ్యూ : థ్రిల్లింగ్ కాన్సెప్ట్‏తో  'కోట బొమ్మాళి పీఎస్‌’

రివ్యూ : థ్రిల్లింగ్ కాన్సెప్ట్‏తో  'కోట బొమ్మాళి పీఎస్‌’

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
నిర్మాణ సంస్థ : GA2 పిక్చర్స్
తారాగణం: శ్రీకాంత్ మేక, వరలక్ష్మి శరత్‌కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ఇతర ప్రముఖ నటీనటులు
సంగీత దర్శకుడు: రంజిన్ రాజ్, మిధున్ ముకుందన్
డైలాగ్స్: నాగేంద్ర కాశి, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్, ఆర్ట్ డైరెక్టర్: గాంధీ నడికుడికర్
కాస్ట్యూమ్ డిజైనర్: అపూర్వ రెడ్డి, కో-డైరెక్టర్: రామ్ నరేష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అజయ్ గద్దె
సహ నిర్మాతలు: భాను ప్రతాప, రియాజ్ చౌదరి
నిర్మాతలు: బన్నీ వాస్, విద్యా కొప్పినీడి, దర్శకుడు: తేజ మార్ని
విడుదల తేదీ : 24.11.2023

మలయాళ హిట్ సినిమా 'నాయట్టు' స్ఫూర్తితో జీఏ2 పిక్చర్స్ సంస్థ నిర్మించిన సినిమా 'కోట బొమ్మాళి పీఎస్'. చిన్న చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రానికి కేవలం ఈ ఒక్క పాట మాత్రమే లెక్కలేనంత పాపులారిటిని తీసుకువచ్చింది. ఇక ఈ పాటలోని హుక్ స్టెప్ నెట్టింట ఎంత ఫేమస్ అనేది చెప్పక్కర్లేదు. కోటబొమ్మాళి పీఎస్ సినిమా ఈ రోజు అడియన్స్ ముందుకు వచ్చింది. సీనియర్ హీరో శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ మూవీ సమీక్షా ఎలా ఉందొ చూద్దాం.  

కథ :

రామకృష్ణ (శ్రీకాంత్) ‘కోటబొమ్మాళి పీఎస్‌’లో సీనియర్ హెడ్ కానిస్టేబు‌ల్. కూంబింగ్ ఆపరేషన్‌లో ఎక్స్‌ఫర్ట్ అండ్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్. రవి (రాహుల్ విజయ్) కానిస్టేబుల్‌గా కోటబొమ్మాళి స్టేషన్‌‌లో కొత్తగా జాయిన్ అవుతాడు. అదే స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ ఉంటుంది కుమారి (శివానీ రాజశేఖర్‌). టెక్కలి ఉప ఎన్నికను అధికార పార్టీ ఛాలెంజ్‌గా తీసుకుంటుంది. ఈ ఎన్నికల్లో ఓడిపోతే మెయిన్ ఎలక్షన్‌లో గెలవడం కష్టం అనుకున్న అధికార పార్టీ యంత్రాంగం మొత్తాన్ని దింపుతుంది. భారీగా మద్యం, డబ్బులు పంచుతుంది. అధికారం బలం, బలగంతో ఎలాగైనా గెలవడానికి స్వయంగా హోం మంత్రి మురళీ శర్మ రంగంలోకి దిగుతాడు. అక్కడ ఓ కులానికి సంబంధించిన ఓట్లే ఎన్నికను డిసైడ్ చేయడంతో.. ఆ కులం ఓట్లను రాత్రికి రాత్రే కొనేస్తాడు హోం మంత్రి. మరో 24 గంటల్లో ఎన్నికలనగా.. రామకృష్ణ, రవి, కుమారి ముగ్గురూ ఓ పార్టీకి వెళ్లి వస్తుండగా.. యాక్సిడెంట్‌ అవుతుంది. ఆ యాక్సిడెంట్‌లో ఆధిపత్య కులానికి సంబంధించిన యువకుడు మరణిస్తాడు. అతని మరణం ఎన్నికల్ని ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో.. ఆ కేసు ఈ ముగ్గురికీ ఉచ్చులా మారుతుంది. అలాంటి పరిస్థితుల్లో రామకృష్ణ ఎలాంటి సాహసం చేశాడు? రవి, కుమారిలను ఎలా కాపాడగలిగాడు? పోలీస్ బాస్ రజియా అలీ (వరలక్ష్మీ శరత్‌ కుమార్‌)ని ఏవిధంగా ముప్పుతిప్పలు పెట్టాడు? చివరికి ఊహకందని మలుపుతో ఎలాంటి సాహసానికి పూనుకున్నాడనేదే మిగిలిన కథ.

నటి నటుల హావభావాలు:

శ్రీకాంత్‌, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, రాహుల్‌ విజయ్‌, శివానీ రాజశేఖర్‌ ఆయా పాత్రల్లో ఒదిగిపోయి నటించారు. ముఖ్యంగా రామకృష్ణ పాత్ర.. శ్రీకాంత్‌కి అతని కెరియర్‌లో మరో బెస్ట్ రోల్ పడింది. శ్రీకాంత్‌కి చాలాకాలం తరువాత ఫుల్ లెంగ్త్ రోల్‌లో పెర్ఫార్మెన్స్‌కి స్కోప్ ఉన్న పాత్ర లభించింది. ఓ వైపు ఫ్యామిలీ.. మరో వైపు విధి నిర్వహణలో నలిగిపోయే పాత్రలో అద్భుతంగా ఎమోషన్స్ పండించాడు. కూతురు సెంటిమెంట్ సీన్‌కి అయితే కళ్లు చెమ్మగిల్లుతాయి. రవి, కుమారిలను కాపాడటానికి రామకృష్ణ చేసిన త్యాగానికి అయితే ఒక్కసారిగా గుండె బరువెక్కుతుంది. ‘ఈ పోలీస్ ఉద్యోగం నాకు ఖాకీ చొక్కా ఇచ్చింది కానీ.. నా కుటుంబాన్ని లాగేసుకుంది’.. ‘గన్ గవర్నమెంట్‌ది వేలు మాత్రం పోలీస్ ది’, ‘ఖాకీ చొక్కా నలిగే కొద్దీ చట్టం అర్ధం అవుతూనే ఉంటుంది.. బెల్ట్ మెడకి వేస్తే కుక్క అదే బెల్టు నడుముకి వేస్తే పోలీస్’ అంటూ శ్రీకాంత్ చెప్పే డైలాగ్‌లు ఆలోచింపజేస్తాయి. క్లైమాక్స్‌లో కుక్కని చూపిస్తూ, దాన్ని సొసైటీకి లింక్ చేసి మురళీ శర్మ చెప్పిన డైలాగ్‌‌ బాగా పేలింది. కొత్త కానిస్టేబుల్‌గా రాహుల్ విజయ్, తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. తన పాత్ర పరిధి.. హీరోయిజం లాంటి వాటిని బేరీజు వేసుకోకుండా, పెర్ఫామెన్స్‌కి స్కోప్ ఉన్న పాత్రని చేసి మెప్పించాడు. శివానీ రాజశేఖర్‌ అయితే కానిస్టేబుల్ కుమారి పాత్రలో ఒదిగిపోయింది. శ్రీకాకుళం యాసలో మెప్పించింది. డీ గ్లామర్‌గా కనిపించి తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది.

సాంకేతిక వర్గం పనితీరు:

మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘నయట్టు’ మూవీకి ‘కోటబొమ్మాళి పీఎస్‌’ రీమేకే అయినా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసి ఒరిజినల్ ఫ్లేవర్ మిస్ కాకుండా కథను సస్పెన్స్ థ్రిల్లర్‌గా మలిచాడు దర్శకుడు తేజ మార్ని. ‘న్యాయంపై ఎప్పుడూ రాజకీయం గెలవలేదు’ అనే సందేశాన్ని పెయిన్ ఫుల్‌గా చూపించాడు . వ్యవస్థలో ఉన్న లోపాలను చూపించారే తప్పితే.. ఎక్కడా గీత దాటలేదు. సోషల్ మెసేజ్ అనేసరికి అనర్గళమైన ప్రసంగాల జోలికి పోకుండా, ఎమోషన్స్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఓ వైపు సిస్టమ్‌లో ఉన్న లోపాల్ని చూపిస్తూనే.. మిడిల్ క్లాస్ కానిస్టేబుల్ ఇళ్లలో జరిగే పరిణామాలను.. ఫ్యామిలీ ఎమోషన్స్‌ని ఇందులో చక్కగా చూపించారు. దర్శకుడు తేజ మార్నికి కోట బొమ్మాళి ప్రాంతంపై మంచి పట్టు ఉండటంతో, రియల్ లొకేషన్స్‌లో సహజత్వాన్ని చూపించారు. ఫస్టాఫ్ రేసీగా సాగిపోతుంది. మధ్యలో కాస్త స్పీడ్ తగ్గినా.. నెక్స్ట్ ఏం జరుగుతుందనే సస్పెన్స్‌ని క్లైమాక్స్ వరకూ మెయిన్‌టైన్ చేశాడు దర్శకుడు. స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్‌గా వుంది.  సినిమా నేపథ్యంకి తగ్గట్టుగా చాలా నాచురల్ గా సినిమాని తెరకెక్కించారు. టెక్నీషియన్ టీం లో రంజిన్ రాజ్ మ్యూజిక్ బాగుంది. అలాగే జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. ఈ చిత్రంలో గీతా ఆర్ట్స్ 2 వారి నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

విశ్లేషణ:

‘కోట బొమ్మాళి పీఎస్‌’ కథ కూడా ఇలాంటిదే. ఓటు విలువను తెలియజెప్పి.. ప్రతి ఓటరుని ఆలోచింపచేసే సందేశాత్మక చిత్రం ‘కోటబొమ్మాళి పీఎస్‌’. ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “కోట బొమ్మాళి పి ఎస్” లో శ్రీకాంత్ రోల్ ఆడియెన్స్ ని మెప్పిస్తుంది. అయితే స్లోగా నడిచే ఫస్టాఫ్ కొంతమేర బోర్ సన్నివేశాలు పక్కన పెడితే ఇంప్రెస్ చేసే సెకండాఫ్ మంచి మైండ్ గేమ్ ట్విస్ట్ లు సహా ఎమోషనల్ క్లైమాక్స్ తో మంచి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ని తప్పక చూడొచ్చు. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :