ASBL NSL Infratech

ప్ర‌భాస్ కు జోడీగా కియారా?

ప్ర‌భాస్ కు జోడీగా కియారా?

గ‌తేడాది డిసెంబ‌ర్లో వ‌చ్చిన స‌లార్ పార్ట్1 ఆడియ‌న్స్ కు ఏ రేంజ్ లో కిక్కిచ్చిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆ సినిమాకు సీక్వెల్ గా స‌లార్2 ఎప్పుడొస్తుందా అని ఆడియ‌న్స్ వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు. ఇంకా ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొద‌లు కాలేదు. ప్ర‌స్తుతం క‌ల్కి సినిమా ప‌నుల్లో బిజీగా ఉన్న ప్ర‌భాస్ అది రిలీజ‌వ్వ‌గానే స‌లార్-2 ను సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్నాడు.

స‌లార్-2 స్క్రిప్ట్ ను ఇప్ప‌టికే రెడీ చేసి ప్ర‌శాంత్ నీల్ ప్ర‌భాస్ కోసం రెడీ గా ఉన్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట హ‌ల్చల్ చేస్తుంది. స‌లార్-1లో శృతి హాస‌న్ హీరోయిన్ గా న‌టించగా, ఇప్పుడు స‌లార్-2లో కియారా అద్వానీని తీసుకురావ‌డానికి ట్రై చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అలా అని శృతి ప్లేస్ లో కియారా రావ‌డం లేదు.

స‌లార్-2 క‌థ ప‌రంగా శృతి కాకుండా మ‌రో అమ్మాయి అవ‌స‌రం రావ‌డంతో బాలీవుడ్ భామ అయితే బాగుంటుంద‌ని నీల్, కియారా పేరును ప‌రిశీలిస్తున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ తో గేమ్ ఛేంజ‌ర్ చేస్తున్న కియారా, ఆ త‌ర్వాత వార్2 లో కూడా న‌టిస్తుంది. ఇప్పుడు స‌లార్2 కోసం ప్ర‌భాస్ కు జోడీగా అంటే నో చెప్పే ఛాన్సే లేదు. ఈ విష‌యంలో క్లారిటీ రావ‌డానికి మ‌రికొంత టైమ్ ప‌ట్ట‌నుంది.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :