ASBL NSL Infratech

కృష్ణ‌మ్మ వాయిదా వెనుక కార‌ణాలు

కృష్ణ‌మ్మ వాయిదా వెనుక కార‌ణాలు

సినిమా రిలీజ్ విష‌యంలో ప్లానింగ్ లేక‌పోతే ఎంత పెద్ద సినిమాకైనా ఇబ్బందులు త‌ప్ప‌వు. ముందు చెప్పిన మాట త‌ప్ప‌కూడ‌ద‌నే ఆలోచ‌న‌తో పోటీ ఉన్నా తొంద‌ర‌ప‌డి సినిమాను రిలీజ్ చేస్తే బ్రేక్ ఈవెన్ సంగ‌తి ప‌క్క‌న పెడితే క‌నీస ఓపెనింగ్స్ కూడా రావు. స‌త్య‌దేవ్ హీరోగా వ‌స్తున్న కృష్ణ‌మ్మ చిత్ర యూనిట్ ఈ విష‌యంలో చాలా తెలివిగా వ్య‌వ‌హ‌రించింది.

ఈ సినిమాను ముందు మే 3న రిలీజ్ చేద్దామ‌నుకున్నారు. కానీ ఇప్పుడు అది మే 10కి వాయిదా ప‌డింది. కొర‌టాల శివ నిర్మాణ భాగ‌స్వామ్యంతో రూపొందిన ఈ సినిమా పోస్ట్‌పోన్ వెనుక ఇంట్రెస్టింగ్ విష‌యాలు దాగున్నాయి. మే 3న సుహాస్ మూవీ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం మంచి అంచ‌నాల‌తో రిలీజ్ కానుంది. ఆ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తుంది మైత్రీ మేక‌ర్స్.

మ‌రోవైపు కృష్ణ‌మ్మ సినిమా డిస్ట్రిబ్యూష‌న్ ను కూడా మైత్రీ మేక‌ర్సే తీసుకున్నారు. రెండు మీడియం రేంజ్ సినిమాలు ఒకే రోజు రిలీజ్ చేసి క్లాష్ చేయ‌డం ఎందుకుని భావించి మైత్రీ మేక‌ర్స్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. పైగా ఒకే రోజు రిలీజ్ చేస్తే ఓపెనింగ్స్ ఇబ్బంద‌వుతుంది. అంతేకాదు స‌త్య‌దేవ్ సినిమాకు వ‌చ్చే మినిమం ఓపెనింగ్స్ షేర్ అయిపోతాయి. అది కాకుండా అల్ల‌రి న‌రేష్ ఆ ఒక్క‌టి అడ‌క్కు సినిమాపై క్ర‌మంగా బ‌జ్ పెరుగుతుంది. త‌మ‌న్నా, రాశీఖ‌న్నా న‌టించిన బాక్ అర‌ణ్మ‌యి4 కోసం హార్ర‌ర్ ల‌వ‌ర్స్ వెయిట్ చేస్తున్నారు. ఇన్నింటి మ‌ధ్యలో రావ‌డం కంటే సింగిల్ గా వ‌చ్చి మౌత్ టాక్ తో ఆడియ‌న్స్ ను థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌డం బెట‌రని కృష్ణ‌మ్మ సినిమాను మే 10కి వాయిదా వేసిన‌ట్లు స‌మాచారం.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :