ASBL NSL Infratech

టిక్ టాక్ ను అమ్మడం లేదు... అమెరికాకు తేల్చిచెప్పిన చైనా

టిక్ టాక్ ను అమ్మడం లేదు...  అమెరికాకు తేల్చిచెప్పిన చైనా

టిక్‌టాక్‌ ఓ పాపులర్‌ వీడియో యాప్‌ అన్న విషయం తెలిసిందే. అయితే ఆ చైనీస్‌ యాప్‌పై అమెరికాలో ఓ చట్టాన్ని చేశారు.  ఆ యాప్‌ను అమ్మివేయాలని లేదంటే బ్యాన్‌ చేస్తామని ఇటీవల అమెరికా హెచ్చరించింది. ఆ హెచ్చరికల నేపథ్యంలో టిక్‌టాక్‌ చైనీస్‌ కంపెనీ బైట్‌డ్యాన్స్‌ ఓ ప్రటకన చేసింది. టిక్‌టాక్‌ను అమ్మే ఆలోచన లేనట్లు ఆ సంస్థ వెల్లడిరచింది. అమెరికా ఉభయసభలు రూపొందించిన చట్టాన్ని కోర్టులో సవాల్‌ చేయనున్నట్లు ఇటీవల టిక్‌ టాక్‌ కంపెనీ తెలిపింది. టిక్‌టాక్‌ను అమ్మే లేదా బ్యాన్‌ చేసే చట్టంపై అధ్యక్షుడు బైడెన్‌ సంతకం చేశారు. బైట్‌డ్యాన్స్‌ కంపెనీపై చైనా ప్రభుత్వం ఆధిపత్యం ఏమీలేదని టిక్‌టాక్‌ పదేపదే వెల్లడిరచిన విషయం తెలిసిందే.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :