ASBL NSL Infratech

బీఆర్ఎస్‌కు డిపాజిట్లు కూడా దక్కవు: కిషన్ రెడ్డి

బీఆర్ఎస్‌కు డిపాజిట్లు కూడా దక్కవు: కిషన్ రెడ్డి

లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, ఈ దఫా పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క ఎంపీ సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. ఆదివారం ఓ టీవీ చానెల్‌‌ డిబేట్‌లో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా బీజేపీ సొంతంగా 370 సీట్లు సాధింస్తుందని, తెలంగాణలో కూడా డబుల్ డిజిట్ సీట్లు గెలవడం పక్కా అని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్న అంశంపై స్పందిస్తూ.. అలాంటి ఆలోచన బీజేపీకి ఏ మాత్రం లేదని, అయితే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటల కారణంగా రేవంత్ రెడ్డి సర్కార్ కూలితే తమకు సంబంధం లేదని వివరణ ఇచ్చారు.

అలాగే బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని, రిజర్వేషన్లను తొలగించేస్తోందంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను కూడా కిషన్ రెడ్డి తిప్పికొట్టారు. రాజ్యాంగం, రిజర్వేషన్లపై కాంగ్రెస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, వీటికి ప్రధాని మోదీ సైతం వివరణ ఇచ్చారని గుర్తు చేశారు. ‘‘రాజ్యాంగాన్ని మార్చే ఆలోచన బీజేపీకి లేనే లేదు. రాజ్యాంగం గౌరవాన్ని మరింత పెంచేలా చూస్తాం. రిజర్వేషన్లపై అమిత్ షా ఫేక్ వీడియోను కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. ఈ కేసులో సీఎం రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని ఎవరూ అనడంలేదు. కానీ తప్పు ఎవరు చేసినా తప్పే. దానికి తగ్గట్లే చట్టం చర్యలు తీసుకుంటుంది’’ అని స్పష్టం చేశారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :