ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

"బ్రో" చిత్రాన్ని USA లో రిలీజ్ చేయనున్న "పీపుల్ సినిమాస్"

"బ్రో" చిత్రాన్ని USA లో రిలీజ్ చేయనున్న "పీపుల్ సినిమాస్"

పవన్ కళ్యాణ్ ,సాయిధరమ్ తేజ్ ల కాంబినేషన్ లో పి.సముద్రఖని   దర్శకత్వంలో చేస్తున్న సినిమా "బ్రో". ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మరియు సహనిర్మాత వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు.
 
తమిళ్ లో  సూపర్ హిట్ అయిన ఈ సినిమాకు తెలుగులో మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే &  డైలాగ్స్ ను అందిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ సినిమాపై భారీ అంచనాలను పెంచుతుంది.

"బ్రో"  ఫస్ట్ లుక్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ ఫస్ట్ లుక్ తో వింటేజ్ పవన్ కళ్యాణ్ ని చూపిస్తూ  అభిమానులకు మంచి సప్రైజ్ ఇచ్చింది చిత్రబృందం. రీసెంట్ గా రిలీజైన టీజర్ కి కూడా అద్భుతమైన స్పందన లభించింది. ప్రస్తుతం యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకెళ్తుంది ఈ టీజర్. 

"బ్రో" సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది అని చిత్ర బృందం ఇదివరకే అధికారికంగా ప్రకటించింది. ఎన్నో అంచనాలను క్రియేట్ చేసిన ఈ  "బ్రో" చిత్రాన్ని Usa లో "పీపుల్ సినిమాస్" రిలీజ్ చేయనుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :