ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

రివ్యూ : విసిగించిన 'డెవిల్'

రివ్యూ : విసిగించిన 'డెవిల్'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థ : అభిషేక్ పిక్చర్స్,
నటీనటులు : నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్తా మీనన్, వశిష్ణ, మాళవిక నాయర్, ఎలీనాజ్ నోరూజి,
అమ్ము అభిరామి, షఫీ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యా అక్కాలా, అజయ్, సీతా, జబర్దస్త్ మహేష్, ఈస్టర్ నొరోన్హా, తదితరులు
సంగీతం : హర్షవర్ధన్ రామేశ్వర్, సినిమాటోగ్రఫీ : సౌందర్ రాజన్
ఎడిటర్ : తమ్మిరాజు, కథ, మాటలు : శ్రీకాంత్ విస్సా, సమర్పణ : దేవాన్ష్ నామ
నిర్మాత, దర్శకుడు :  అభిషేక్ నామ
విడుదల తేదీ : 29.12.2023
నిడివి : 146 నిముషాలు  

గత ఏడాది 'బింబిసారా' తో బ్లాక్ బస్టర్ అందించిన నందమూరి కళ్యాణ్ రామ్, ఈ ఏడాది ప్రారంభం లో 'అమిగోస్' తో ప్లాప్ చవి చూసాడు.  ఇదే  ఏడాది చివర్లో ఈ రోజు ‘డెవిల్’. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్ తో మన ముందుకు వచ్చాడు.  సంయుక్తా మీనన్, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాని ‘అభిషేక్ పిక్చ‌ర్స్’ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా నిర్మించడమే కాకుండా డైరెక్షన్ డిపార్మెంట్ లో ఎంట్రీ కావడం విశేషం.  ‘డెవిల్’ మూవీ.టీజర్, ట్రైలర్స్, థియేట్రికల్ ట్రైలర్స్, అద్భుతంగా ఉండడంతో సినిమా మీద పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. అలాంటి డెవిల్ సినిమా కథాకథనాలు ఏంటో ఓ సారి చూద్దాం. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ పీరియాడికల్ మూవీ ఏ మేరకు ప్రేక్షకుడిని ఆకట్టుకుందో రివ్యూ లో చూద్దాం.   

కథ :

ఈ కథ 1945 ప్రాంతంలో జరుగుతుంటుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను పట్టుకునేందుకు అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం నానా తంటాలు పడుతుంటుంది. అలాంటి టైంలోనే బోస్‌ ఇండియాలోకి అడుగు పెడుతున్నాడంటూ బ్రిటీష్ ఏజెన్సీలు తెలుసుకుంటాయి. బోస్‌ను ఎలాగైనా పట్టుకోవాలని అనుకుంటూ ఉంటాయి. అదే టైంలో మద్రాసు ప్రెసిడెన్సీలోని రాసపాడు జమీందారు కూతురు విజయ (అభిరామి) హత్య జరుగుతుంది. కూతుర్ని హత్య చేశారన్న ఆరోపణల మీద జమీందారుని అరెస్ట్ చేస్తారు. ఈ కేసును చేధించేందుకు బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ డెవిల్ (కళ్యాణ్ రామ్) రంగంలోకి దిగుతాడు. ఈ కేసులో జమీందారు మేనకోడలు నైషధ (సంయుక్త మీనన్)ను డెవిల్ ఓ కంట కనిపెడుతుంటాడు. అసలు ఈ కేసుకు, బోస్‌‌ను పట్టుకునే మిషన్‌కు ఉన్న లింక్ ఏంటి? ఈ కథలో సుభాష్ చంద్రబోస్‌కు రైట్ హ్యాండ్ అయిన త్రివర్ణ ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఒక్కొక్కటిగా ఏ విధంగా బయట పడతాయి? మణిమేఖల (మాళవిక నాయర్) పాత్ర ఏంటి? ఎలీనాజ్ నోరూజి, ఈస్టర్ నొరోన్హా, సముద్ర (వశిష్ట), షఫీ (షఫీ), జబర్దస్త్ మహేష్ (శేఖర్) పాత్రలకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి? అన్నది థియేటర్లో చూడాల్సిందే.  

నటీనటుల హావభావాలు :

కళ్యాణ్ రామ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రెండు షేడ్స్‌లో అద్భుతంగా కనిపిస్తాడు. అంతే అద్భుతంగా నటించాడు. ఇక యాక్షన్ సీక్వెన్స్‌ల్లో కళ్యాణ్ రామ్ ఎలా కుమ్మేస్తాడో అందరికీ తెలిసిందే. కాకపోతే కాస్త అతిగా అనిపించాయి.  మాళవిక నాయర్ అప్పియరెన్స్, పాత్ర తీరు బాగుంటుంది. సంయుక్తా మీనన్ అందంగా కనిపిస్తుంది. కాస్త ప్రాధాన్యం ఉన్న పాత్రే దక్కింది. బ్రిటీష్ ఆఫీసర్లుగా కనిపించిన వారు చక్కగా నటించారు. వశిష్ట, షఫీ, మహేష్, కమెడియన్ సత్య, శ్రీకాంత్ అయ్యంగార్, అభిరామి, ఏస్తర్ ఇలా అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు:

ఈ చిత్రానికి ప్రధానమైన లోటు దర్శకత్వపు శాఖ దర్శకుడిగా తెరపై అభిషేక్ నామా పేరు కనిపిస్తుంది కాబట్టి, వేళ్లన్నీ అతని వైపే చూపిస్తాయి. ఇక సంగీతం విషయానికి వస్తే..  పాటలు గుర్తుండకపోగా..  వెనకాల వచ్చే ఓ  పాట, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వింటే నవ్వొస్తుంది. హర్షవర్దన్ ఇలాంటి ఆర్ఆర్ ఇచ్చాడేంటి? అనుకుంటారు. కెమెరామేన్ పనితనం ఈ సినిమాకి ప్రధాన బలం. ప్రతి ఫ్రేమ్ చాలా ఎఫెక్టివ్ గా తీశారు. ఆర్ట్ వర్క్  బాగుంది. సినిమా చాలా రిచ్‌గా అనిపిస్తుంది.సినిమాలోని నిర్మాణ విలువ‌లు చాలా బాగున్నాయి. నిర్మాతగా అభిషేక్ సక్సెస్ అయ్యాడు. కానీ దర్శకుడిగా మాత్రం అంతగా సక్సెస్ కాలేదనిపిస్తుంది. మాటలు అక్కడక్కడ మెప్పిస్తాయి.  

విశ్లేషణ:

డెవిల్ కథ, కథనాలు, తీసుకున్న పాయింట్ ఇవేవీ కూడా కొత్తగా అనిపించవు. కానీ సెటప్ మాత్రమే కొత్తగా అనిపిస్తుంది. 1945 ప్రాంతాన్ని ఎంచుకోవడం, సుభాష్ చంద్రబోస్ అనే పాయింట్ చుట్టూ కథనాన్ని నడిపించడం మాత్రమే కొత్తగా అనిపిస్తుంది. ఇక ఇందులో కథను రాసుకున్న తీరు, దీనికి క్రైమ్ థ్రిల్లర్ జానర్‌ను యాడ్ చేసేందుకు అన్నట్టుగా హత్య జరగడం, ఆ కేసును చేదించే క్రమంలో ఒక్కో పాయింట్ ఆడియెన్స్‌కు రివీల్ అవుతుంటాయి. ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్ లో.. యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆకట్టుకున్నాయి.  ఐతే, రొటీన్ స్క్రీన్ ప్లే, కీలక సన్నివేశాలు స్లోగా సాగడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఇక ఈ సినిమా క్లైమాక్స్ చూస్తే మాత్రం నాసిరకంగా అనిపిస్తుంది. బ్రిటీష్ సైన్యాన్ని కళ్యాణ్ రామ్ ఊచకోత కోెస్తుంటే మళ్లీ మన రొటీన్ రొడ్డ కొట్టుడు సినిమాగా మార్చారు. ఫస్ట్ హాఫ్ ఏదో ఇంట్రెస్ట్‌‌గానే తీసుకెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ సస్పెన్స్ మాత్రం మెయింటైన్  చేయలేకపోయారేమోననిపిస్తుంది. పాటలు స్పీడు బ్రేకర్లలా అడ్డు పడ్డట్టుగానే ఉంటాయి.

ద్వితీయార్దంలో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు ఓకే అనిపిస్తాయి. అవి మరీ అంత గొప్పగా అనిపించవు. ఇక క్లైమాక్స్‌కు వచ్చే సరికి ఈ డెవిల్ ఓ సగటు తెలుగు కమర్షియల్ సినిమాగా మారుతుంది. చివరగా ఇరవై నిముషాలు సినిమాను చూడకుండా కూడా బయటకు వచ్చినా పెద్ద తేడా ఏమీ ఉండదు. మొత్తం ఊచకోతే కనిపిస్తుంది. అది కూడా పరమ రొటీన్ యాక్షన్ సీక్వెన్స్‌లా కనిపిస్తుంది. జనాల్ని ఎంగేజింగ్ చేసే పాయింట్ దొరికినా, కథ ఉన్నా కూడా తెరపై మాత్రం అది ఆవిష్కృతం కాలేదు. ఇలాంటి చిత్రాలు మామూలుగా అయితే ప్రేక్షకుడు ఊపిరి బిగపట్టుకుని చూసేలా ఉండాలి. కానీ ఈ డెవిల్ సినిమాను పూర్తిగా రిలాక్స్ అవుతూ చూస్తుంటారు. అంత నీరసంగా, నెమ్మదిగా సాగుతుంటుంది సినిమా. ఇలా తీయడంలో దర్శకుడిదే పూర్తి వైఫల్యం అనిపిస్తుంది. అయితే ఈ వైఫల్యాన్ని ఎవరు తీసుకుంటారు? ఎవరికి ఆపాదిస్తారన్నది వేచి చూడాలి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :