ASBL NSL Infratech

బాబాయ్ కి తోడుగా అబ్బాయి.. గ్లోబల్ స్టార్ స్పెషల్ ట్వీట్..

బాబాయ్ కి తోడుగా అబ్బాయి.. గ్లోబల్ స్టార్ స్పెషల్ ట్వీట్..

నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ ఒక్కరే ప్రచారం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో మెగా హీరోలు ఒక్కొక్కరు అతనికి మద్దతుగా తరలివచ్చి ప్రచారం చేపడుతున్నారు. వరుణ్ తేజ్, సాయి ధరంతేజ్, వైష్ణవ తేజ్.. పిఠాపురం చేరుకొని పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే మెగా కాంపౌండ్ లో అందరికంటే ఎక్కువ ప్రాముఖ్యత ఉన్న మెగాస్టార్.. అతని కొడుకు రామ్ చరణ్ రాజకీయాలకు చాలా దూరంగా ఉంటూ వచ్చారు.. అయితే తాజాగా మెగాస్టార్ తన తమ్ముడిని గెలిపించండి అని పిఠాపురం ప్రజలను రిక్వెస్ట్ చేస్తూ ఓ వీడియోని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు అదే వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. మీ భవిష్యత్తు కోసం పాటుపడే నాయకుడు పవన్ కళ్యాణ్.. అతన్ని గెలిపించండి అని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టును మెగా అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :