ASBL NSL Infratech

కొలంబియా వర్సిటీలో ఉద్రిక్తత.. 300 మందికి పైగా ఆందోళకారులను

కొలంబియా వర్సిటీలో ఉద్రిక్తత..  300 మందికి పైగా ఆందోళకారులను

అమెరికాలో గాజా ఆందోళనలకు కేంద్ర బిందువైన న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీలోకి పోలీసులు భారీ సంఖ్యలో ప్రవేశించారు. 300 మందికి పైగా నిరసనకారులను అరెస్టు చేశారు. గాజాలో తక్షణ కాల్పులు విరమణ కోరుతూ పాలస్తీనియన్లకు మద్దతుగా రెండు వారాలుగా కొలంబియా విద్యార్థులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. యూనివర్సిటీ అధికారులు, విద్యార్థుల మధ్య జరుగుతున్న చర్చలు విఫలమయ్యాయి. దీంతో యూనివర్సిటీలోకి పోలీసులు ప్రవేశించేందుకు అధికారులు అనుమతిచ్చారు. విద్యార్థుల నియంత్రణలో ఉన్న హామీల్టన్‌ హాల్‌లోకి పోలీసులు ప్రవేశించి నిరసనకారులను తరిమివేశారు. యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, లాస్‌ ఏంజెలెస్‌ (యూసీఎల్‌ఏ)లోనూ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇక్కడ పాలస్తీనా, ఇజ్రాయెల్‌ అనుకూల వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో  ఘర్షణలు చెలరేగాయి. పోలీసులు ప్రవేశించడంతో పరిస్థితి నియంత్రణలోకి వచ్చింది. నార్తర్న్‌ ఆరిజోనా యూనివర్సిటీలో 20 మంది విద్యార్థులను అరెస్టు చేశారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :