ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ మూవీ మంచి ధమ్ బిర్యానీలా ఉంటుంది : కోన వెంకట్

‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ మూవీ మంచి ధమ్ బిర్యానీలా ఉంటుంది : కోన వెంకట్

అందాల నటి అంజలి 'గీతాంజలి' ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం "గీతాంజలి మళ్లీ వచ్చింది" చిత్రం మీద అందరి దృష్టి పడింది. ఈ చిత్రాన్ని శివ తుర్లపాటి దర్శతక్వంలో MVV సినిమాస్‌తో కలిసి కోన ఫిల్మ్స్ కార్పొరేషన్‌పై కోన వెంకట్ నిర్మించారు. అంజలికి ఇది 50వ చిత్రం.దీంతో ఈ చిత్రం ఆమెకు ప్రత్యేకంగా మారింది. హారర్‌ కామెడీ జోనర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందిన 'గీతాంజలి మళ్లీ వచ్చింది' చిత్రాన్ని  ఏప్రిల్ 11న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా..

ఎడిటర్ ఛోటా కె.ప్రసాద్ మాట్లాడుతూ ‘‘అంజలిగారికి ముందుగా కంగ్రాట్స్ చెబుతున్నాను. ఈ సినిమా తర్వాత ఆమె 50 నుంచి డబుల్ సెంచరీ వరకు వెళ్లిపోతుంది. అలాగే కోనగారి స్టైల్లో తెరకెక్కిన గీతాంజలి. డైరెక్టర్ శివ  సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ఇది టీమ్ అందరికీ కొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుంది’’ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజు మాట్లాడుతూ ‘‘గీతాంజలి మళ్ళీ వచ్చింది.. డబుల్ ఎంటర్‌టైనర్, డబుల్ హారర్ ఎలిమెంట్స్‌తో మెప్పిస్తుంది. చాలా రోజుల నుంచి బ్యాగ్రౌండ్ స్కోర్ మీద వర్క్ చేస్తున్నాను. అందరికీ నచ్చుతుందని నమ్మకంగా ఉన్నాం. అంజలిగారి 50వ సినిమా అని స్పెషల్ సాంగ్ చేశాం. త్వరలోనే సినిమా విడుదలవుతుంది’’ అన్నారు.

చిత్ర దర్శకుడు శివ తుర్లపాటి మాట్లాడుతూ ‘‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుంది. సినిమా అంతకు మించి ఉంటుంది. అందరి సపోర్ట్‌తో ఇక్కడి వరకు చేరుకున్నాం. అంజలిగారికి ఇది 50వ సినిమా. ఆమెకు ఈ సందర్భంగా అభినందనలు. శీనన్న, రాజేషన్న, శంకర్, యాదంరాజు సహా అందరికీ థాంక్స్. ఎడిటర్ ఛోటా కె.ప్రసాద్, ప్రవీణ్ లక్కరాజు మంచి మ్యూజిక్ తో పాటు మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఏప్రిల్ 11న మూవీ రిలీజ్. సినిమా చూసి ఎంకరేజ్ చేస్తారని భావిస్తున్నాం’’ అన్నారు.

షకలక శంకర్ మాట్లాడుతూ ‘‘ప్రవీణ్ లక్కరాజు చక్కటి సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. గీతాంజలి సినిమా వచ్చి పదేళ్లు అవుతుంది. ఆ సినిమా అందరి మనసుల్లో అలాగే ఉండిపోతుందనటంలో సందేహం లేదు. ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమాకు చాలా రిస్క్ చేశాం. ఏప్రిల్ 11న రాబోతున్న ఈ సినిమాను అందరూ పెద్ద సక్సెస్ చేయాలి. అంజలికి ఇది 50వ సినిమా. చాలా పెద్ద హిట్ చేసి ఆమెకు గుర్తుండిపోయేలా మంచి గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
సత్యం రాజేష్ మాట్లాడుతూ ‘‘గీతాంజలి సినిమాకు సీక్వెల్‌గా గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమాను తీస్తారని అనుకోలేదు. సినిమా చాలా బాగా వచ్చింది. మళ్లీ మా అందరికీ చాలా మంచి పేరు తీసుకొచ్చే సినిమా అవుతుంది. ఈ సీక్వెల్ తొలి పార్ట్ కంటే సెకండ్ పార్ట్ ఇంకా బాగా భయపెడుతుంది, నవ్విస్తుంది. అంజలికి 50వ సిినిమా ఇది. ఈ వయసలోనే ఆమె 50 సినిమాలను చేయటం అనేది గొప్ప విషయం. మరో పదేళ్లలో ఆమె మరో 50-100 సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. కోన వెంకట్‌గారికి అభినందనలు’’ అన్నారు.

శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ‘‘ఈ మూవీలో నాది కోనగారి క్యారెక్టర్. నా పేరు చెనక్కాయల శీను. ఆయనలాగానే ఈ సినిమాలో కష్టపడుతుంటాను. గీతాంజలి సినిమాతో మా అందరికీ ఓ మెట్టు ఎక్కే అవకాశం దక్కింది. ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చింది చిత్రంతో మరో మెట్టు ఎక్కే అవకాశం దక్కింది. అంజలిగారికి అభినందనలు. తను 50 సినిమాలు పూర్తి చేయటం గొప్ప విషయం. ఏప్రిల్ 11న మూవీ రిలీజ్ అవుతుంది. సినిమాను చూసి పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. డైరెక్టర్ శివగారికి, ఎడిటర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారు సహా అందరరికీ థాంక్స్’’ అన్నారు.

చిత్ర సమర్పకుడు కోన వెంకట్ మాట్లాడుతూ ‘‘గీతాంజలి మాకెంతో స్పెషల్ మూవీ. గీతాంజలి మళ్ళీ వచ్చింది ఇంకా చాలా స్పెషల్ మూవీ. ఎందుకంటే ఇది అంజలికి 50వ సినిమా. ఆమెను అభినందించాల్సిందే. ఓ తెలుగు అమ్మాయి 50 సినిమాలు చేయడటమంటే గొప్ప విషయం. ఇప్పుడింకా గొప్పగా రాబోతుంది. గీతాంజలి ఐడియాను నా దగ్గరకు తెచ్చింది శ్రీనివాస్ రెడ్డినే. ఆ సినిమా సక్సెస్ మా టీమ్‌ను కలిపింది. నేను 55 సినిమాలకు రైటర్ గా వర్క్ చేశాను. అన్నింటినీ ప్రేక్షకులు ఆదరించారు. ఈ సినిమాను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లింది మాత్రం భాను, నందు. సామజవరగమన, భైరవకోన సినిమాలకు వాళ్లు వర్క్ చేశారు. ఈ స్క్రిప్ట్ లో కీలక పాత్రను పోషించారు. కథను నేనిచ్చినా వాళ్లు దాన్ని 10 మెట్లు ముందుకు తీసుకెళ్లారు. ప్రవీణ్ లక్కరాజుని జూనియర్ తమన్ అని పిలుస్తుంటాం. మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఛోటా కె.ప్రసాద్ చాలా కీలక పాత్రను పోషించాడు. డైరెక్టర్ శివకి ఇదొక బెస్ట్ మూవీ అవుతుంది. ఏప్రిల్ 11న మూవీని రిలీజ్ చేస్తున్నాం. తప్పకుండా సినిమాను అందరూ చూడాలని కోరుకుంటున్నాం’’ అన్నారు. ట్రైలర్‌లో చూసింది కొంతే.. సినిమా ధమ్ బిర్యానీలా ఉంటుంది’’ అన్నారు.

రైటర్, దర్శకుడు బి.వి.ఎస్.రవి మాట్లాడుతూ ‘‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ సినిమాను నేను చూశాను. చాలా బాగా వచ్చింది. ఆ నమ్మకంతోనే ఇక్కడకు వచ్చాను. తొలి సినిమాలో ఎలా ఉందో 50 సినిమాలు పూర్తయినప్పటికీ అలాగే ఉంది. చాలా కష్టపడే నటి. తను ఇండస్ట్రీలో ఇంకా గొప్ప స్థాయికి ఎదుగుతుంది. ప్రవీణ్ లక్కరాజు అందించిన మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ అన్నీ నెక్ట్స్ లెవల్ లో ఉంటుంది. సినిమా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. శివ తుర్లపాటికి అభినందనలు. ఛోటా కె.ప్రసాద్ సహా టీమ్ కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు.

డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ ‘‘శివ తుర్లపాటిగారి వల్లనే నా సినీ జర్నీ మొదలైంది. ఆయనే నన్ను కోనగారికి పరిచయం చేశారు. ఇప్పుడు శివ డైరెక్టర్ గా మారాడు. తను వరుస బెట్టి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అంజలిగారి 50వ సినిమా ఇది. ఈ విషయం తెలిసి నాకు ఆశ్చర్యం వేసింది. ఇప్పట్లో ఓ తెలుగు అమ్మాయి ఇన్ని సినిమాలు చేయటం గొప్ప విషయం. ఆమె ఎన్నో డిఫరెంట్ సినిమాలు, రోల్స్ చేశారు. గీతాంజలి పదేళ్ల ముందు ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు సీక్వెల్ గా గీతాంజలి మళ్ళీ వచ్చింది రిలీజ్ అవుతుంది. సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారనటంలో సందేహం లేదు. ఈ సినిమాతో శివను ఇంట్రడ్యూస్ చేసిన కోనగారికి ఈ సినిమా సక్సెస్ కొత్త ఎనర్జీని ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

నిర్మాత డివివి.దానయ్య మాట్లాడుతూ ‘‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. గీతాంజలి కంటే గీతాంజలి మళ్ళీ వచ్చింది పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. కోన వెంకట్ గారికి ఈ సినిమాతో చాలా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

అంజలి మాట్లాడుతూ ‘‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ట్రైలర్ చాలా బాగా వచ్చింది. సినిమా దీని కంటే వంద రెట్లు బావుంటుంది.  నా 50వ సినిమా ఎంతో స్పెషల్ గా ఉండాలని అనుకున్నాను. ఆ కోరిక గీతాంజలి మళ్ళీ వచ్చిందితో తీరింది. నా ఎంటైర్ టీమ్ మనసు పెట్టి ఈ మూవీ చేశారు. అందరూ ఎంటర్ టైన్ కావాలనే ఉద్దేశంతోనే సినిమా చేశాం. కోన వెంకట్ గారికి థాంక్స్. స్పెషల్ సాంగ్ కూడా చిత్రీకరించాం. త్వరలోనే దాన్ని రిలీజ్ చేస్తాం. ఏప్రిల్ 11న మూవీ రిలీజ్ అవుతుంది. కామెడీ, హారర్ ఎలిమెంట్స్ ను మిక్స్ చేసి చేసిన సినిమా. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్’’ అన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :