ASBL NSL Infratech

ప‌క్కా ప్లానింగ్ తో రాజ‌మౌళి

ప‌క్కా ప్లానింగ్ తో రాజ‌మౌళి

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి, టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కాంబోలో రానున్న సినిమా ఎప్పుడెప్ప‌డు స్టార్ట్ అవుతుందా అని ఫ్యాన్స్ తో పాటూ అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన గ్రాండ్ ప్రెస్ మీట్ ను ఉగాది రోజు పెట్టి సినిమాను అనౌన్స్ చేస్తార‌ని అంద‌రూ అనుకున్నారు కానీ తీరా చూస్తే పండ‌గ రోజు ఎలాంటి అప్డేట్ రాలేదు.

ఉగాదికి సినిమాను అనౌన్స్ చేయ‌క‌పోవ‌డానికి వేరే రీజ‌న్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. మే 31న కృష్ణ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఈ సినిమాను ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ తో అనౌన్స్ చేద్దామ‌రి మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నార‌ని ఇన్ సైడ్ టాక్. ఇప్ప‌టికే మ‌హేష్ ఈ సినిమా కోసం క‌స‌ర‌త్తులు చేయ‌డం ప్రారంభించాడు. త‌న హెయిర్ స్టైల్ ను మార్చేశాడు. ఏదైనా ఈవెంట్ కు వెళ్తున్నా అదే హెయిర్ స్టైల్ తో వెళ్తున్నాడు మ‌హేష్.

ఇదంతా రాజ‌మౌళి సినిమా కోస‌మేన‌ని అర్థమ‌వుతుంది. మ‌రో వారం రోజుల్లో ఫోటో షూట్ జ‌రిగే ఛాన్సుంది. ఫారెస్ట్ అడ్వెంచ‌ర్ కాబ‌ట్టి అడవిలో తిరిగే మ‌హేష్ క్యారెక్ట‌ర్ ను చాలా బాగా స్ట‌డీ చేసిన జ‌క్క‌న్న దానిక‌నుగుణంగానే కాస్ట్యూమ్స్ ను కూడా రెడీ చేయించార‌ట. ముందు టీజ‌ర్ తో అనౌన్స్ చేద్దామ‌నుకున్నారు కానీ అది సాధ్యం కాదేమోన‌ని డ్రాప్ అయ్యార‌ట‌. స‌మ్మ‌ర్ త‌ర్వాత రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్టయ్యే ఛాన్సుంది. 2026 రిలీజ్ టార్గెట్ గా ఈ సినిమాను మొద‌లుపెట్టనున్నారు. మ‌రి పూర్త‌య్యేవ‌ర‌కు ఎన్నేళ్లు ప‌డుతుందో చూడాలి.  

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :