ASBL NSL Infratech

జాక్ పాట్ కొట్టేసిన తండేల్

జాక్ పాట్ కొట్టేసిన తండేల్

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో చాలా సినిమాల‌కు ఓటీటీ డీల్స్ జ‌ర‌గ‌క నిర్మాత‌లు ఇబ్బంది ప‌డుతున్నారు. సినిమా మొద‌లుపెట్టిన టైమ్ లో ఏవో ఊహించుకున్న నిర్మాత‌ల‌కు డిజిట‌ల్ కంపెనీలు షాకిస్తున్నాయి. నిర్మాతలు ఊహించిన‌ రేట్లు ఆఫ‌ర్ చేయ‌క‌పోవ‌డంతో కొంద‌రు బ‌డ్జెట్ లో కోత పడుతుండ‌గా మ‌రికొంద‌రైతే షూటింగ్స్ వాయిదా వేస్తున్నారు.

మ‌రికొన్ని సినిమాలైతే ఏకంగా క్యాన్సిల్ అవుతున్నాయి. ఇలాంటి టైమ్ లో అక్కినేని నాగచైత‌న్య తండేల్ కు నెట్‌ఫ్లిక్స్ భారీ ధ‌ర ఇచ్చింద‌నే వార్త నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాను సుమారు రూ.40 కోట్ల‌కు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న‌ట్లు వార్తలొస్తున్నాయి. ఇది నిజమైతే మాత్రం చైతూ కెరీర్లోనే ఇది చాలా పెద్ద డీల్.

దీనికి చాలా కార‌ణాలున్నాయి. తండేల్ బ్యాక్ డ్రాప్ ఇండియా- పాకిస్థాన్ దేశాల్లో జ‌ర‌గ‌డం, సాయి ప‌ల్ల‌వి హీరోయిన్ కావ‌డం, దేవీ శ్రీ మ్యూజిక్ అందించ‌డం, కార్తికేయ‌2 త‌ర్వాత చందూ నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డం వీటన్నింటికి తోడు అల్లు అరవింద్- గీతా ఆర్ట్స్ బ్రాండ్ ఇవ‌న్నీ కార‌ణాలు. వాటితో పాటూ చైతూ ఇమేజ్ కూడా ఒక రీజ‌న్. దాదాపు రూ.100 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతున్న తండేల్ కు ఇప్పుడు నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ రూపంలో రూ.40 కోట్లు వ‌చ్చాయంటే రిక‌వ‌రీ శాతం బాగా పెరిగిన‌ట్లే. తండేల్ ను డిసెంబ‌ర్ లో రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నార‌ట‌.  

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :