సుధీర్, ఆనంద్ ల్లో గెలిచేదెవరు?
ఒకప్పుడు వారానికి ఓ సినిమా రావడమే గగనమయ్యేది. కానీ ఇప్పుడు చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు అన్నీ రిలీజ్ డేట్ల సమస్య ఎదుర్కొంటున్నవే. ఈ నేపథ్యంలో ఏదైనా డేట్ ఖాళీగా ఉండటం లేట్.. దాని మీద మీడియం, చిన్న సినిమా నిర్మాతలు వెంటనే కర్చీఫ్ వేసేస్తున్నారు. సుధీర్ బాబు నటిస్తున్న హరోంహర సినిమాను మే 31న కృష్ణ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ రీసెంట్ గానే అనౌన్స్ చేశారు.
జ్ఞాన సాగర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై సుధీర్ బాబు చాలానే ఆశలు పెట్టుకున్నాడు. వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న సుధీర్ కు ఈ సినిమా హిట్ అవడం ఎంతో అవసరం కూడా. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్ ఇంట్రెస్టింగానే ఉన్నాయి. ఇక అదే రోజున ఆనంద్ దేవరకొండ గం గం గణేశా మూవీ కూడా రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
వాస్తవానికి గం గం గణేశా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వస్తుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో సాగే థ్రిల్లర్ కాబట్టి పెర్ఫార్మెన్స్ పరంగా ఆనంద్ మంచి వేరియేషన్స్ చూపించాడనే టాక్ బాగా వినిపిస్తోంది. హైప్ పరంగా చెప్పాలంటే రెండూ ఒకే స్థాయి సినిమాలు. ఈ సినిమాలను థియేటర్లకు వెళ్లి ఆడియన్స్ చూడాలంటే ఆ రేంజ్ లో ప్రమోషన్స్ ఉండాలి. బడ్జెట్ పరంగా హరోం హరకు ఎక్కువ ఖర్చు పెట్టారు కాబట్టి ఈ సినిమా హిట్ సుధీర్ కు ఎంతో కీలకం కానుంది.