ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

రివ్యూ : ఆకట్టుకునే 'ఆపరేషన్ వాలంటైన్' ఎయిర్ షో

రివ్యూ : ఆకట్టుకునే 'ఆపరేషన్ వాలంటైన్' ఎయిర్ షో

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థలు : సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ 
నటి నటులు : వరుణ్ తేజ్, మానుషి చిల్లర్, నవ్ దీప్, రుహాని శర్మ, మీర్ సర్వర్, అభినవ్ గోమఠం, శుభ శ్రీ, లహరి, శ్వేతా వర్మ, తది తరులు నటించిన...
సినిమాటోగ్రఫీ : హరి కె వేదాంతం, సంగీతం : మిక్కీ జె మేయర్
ఎడిటర్ : నవీన్ నూలి, మాటలు : సాయి మాధవ్ బుర్ర
స్క్రీన్ ప్లే : శక్తి ప్రతాప్ సింగ్ హడా, అమీర్ నాహీద్ ఖాన్, సిద్ధార్థ్ రాజ్ కుమార్
నిర్మాతలు : సోనీ పిక్చర్స్, సందీప్ ముద్ద
దర్శకత్వం : శక్తి ప్రతాప్ సింగ్ హడా
విడుదల తేదీ : 01.03.2024
నిడివి : 2 ఘంటల 13 నిముషములు

ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేస్తూ...రిస్క్ వున్నన్యూ స్టోరీస్ తో ధైర్యంగా మన ముందుకు వస్తున్న వరుణ్ తేజ్ కు కలిసి రావడం లేదు. అయన  గత చిత్రాలు దారుణంగా బెడిసి కొట్టాయి. ఫిదా, తొలిప్రేమ తరువాత మళ్లీ వరుణ్ తేజ్ ఒక్క హిట్టు కొట్టలేకపోయాడు. గని, గాండివధారి అర్జున అంటూ డిజాస్టర్లు ఇచ్చాడు. అయినా సరే ప్రయోగాలు చేయడం మాత్రం మానడం లేదు. ఇక ఇప్పుడు 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మేడిన్ బాలీవుడ్ ప్రాజెక్ట్, పుల్వామా దాడుల నేపథ్యంతో తీసిన ఎయిర్ ఫోర్స్ చిత్రం! మార్చి 1న విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందన్నది ఓ సారి రివ్యూ లో చూద్దాం.

కథ :

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వజ్ర అనే ఓ మిషన్‌ను టెస్ట్ చేస్తుంటుంది. 20 మీ. ఎత్తులో జెట్‌ను నడిపితే.. రాడార్‌కు చిక్కకుండా ఉండే కాన్సెప్ట్‌ కావడంతో దాన్ని పరీక్షించాలనుకుంటాడు వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర (వరుణ్ తేజ్). స్వతహాగా ఆవేశపరుడైన రుద్ర ‘ఆపరేషన్ వజ్రా’లో ఫెయిల్ అవుతాడు.  ఆ పరీక్ష విఫలం కావడంతో జరిగిన ప్రమాదంలో కబీర్ (నవదీప్) మరణిస్తారు. దీంతో ఆ టెస్ట్‌ను, వజ్ర మిషన్‌ను పక్కన పెట్టేస్తుంది మరో వింగ్ కమాండర్ ఆహ్నా గిల్ (మానుషి చిల్లర్). ఆ తరువాత కొన్నేళ్లకు అర్జున్ దేవ్ కోలుకుంటాడు. 2019 ఫిబ్రవరి 14న పాకిస్తాన్ దాడి చేస్తుంది. పుల్వామా ఎటాక్‌లో మన వీర సైనికులు మరణిస్తారు. దీంతో ప్రతీకార చర్య తీర్చుకునేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్‌లోకి వెళ్లి సర్జికల్ స్ట్రైక్ చేసి వస్తుంది.   తరువాత పాకిస్తాన్ చేపట్టిన చర్యలు ఏంటి? వాటిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎలా అడ్డుకుంది? నెహ్రూ అనే కోడ్‌తో పాకిస్థాన్ చేయదల్చుకున్న దాడి ఏంటి? వీటిని వింగ్ కమాండర్ అర్జున్ దేవ్ ఎలా తిప్పి కొట్టాడు? అన్నది తెరపై చూడాల్సిందే.

నటీనటులు హావభావాలు :

వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ అధికారిగా అర్జున్ దేవ్ పాత్రలో చక్కగా సరిపోయాడు. ఆ హైట్, ఆ వెయిట్ చూస్తుంటే నిజంగానే మనం ఓ వింగ్ కమాండర్‌ను చూసినట్టుగానే అనిపిస్తుంది. ఎమోషనల్‌గా నటించాడు. కొన్ని స్పేస్ సన్నివేశాల్లో తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన బాగుంది. మానుషి చిల్లర్ తెరపై అందంగా కనిపిస్తుంది. అంతే ఎమోషనల్‌గానూ నటించింది. నవదీప్‌కు ధృవ సినిమాలో దొరికినట్టుగానే మధ్యలోనే అంతమయ్యే కారెక్టర్ దొరికింది. కానీ ధృవ రేంజ్ నేమ్ అయితే రాదు. అభినవ్ గోమఠం ఉన్నాడంటే ఉన్నాడంతే. కష్టంగా ఓ మూడు నాలుగు సీన్లలో కనిపిస్తాడంతే. ఈ చిత్రంలో బిగ్ బాస్ బ్యాచ్ చాలానే కనిపిస్తుంది. శుభ శ్రీ, లహరి, శ్వేతా వర్మ ఇలా అందరూ కనిపిస్తారు. కానీ వారి పాత్రలకు అంతగా ఏమీ ఇంపార్టెన్స్ ఉండదు.

సాంకేతికవర్గం పనితీరు:

పుల్వామా ఎటాక్ దాడిలో మన సైనికులు చనిపోయిన ఘటన దేశాన్ని కుదిపేసింది. అంతటి ఎమోషన్ ఉన్న పాయింట్‌ను ఎంచుకున్నప్పుడు.. అది జనాలకు ఎంతగా కనెక్ట్ కావాలి.. ఎంత ఎమోషనల్‌గా అనిపించాలి.. కానీ ఆ ఎమోషన్‌ ఇందులో కనిపించదు. అదే ఇందులో మిస్ అవుతుంది.  కథా నేపధ్యాన్ని తీసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోవడంలో మాత్రం కాస్త వెనుకబడ్డారు. కానీ, స్పేస్ నేపథ్యంలో ఆయన రూపొందించిన సన్నివేశాలు, విఎఫ్ఎక్స్ వర్క్ ను వాడుకున్న విధానం ఆకట్టుకున్నాయి. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ సంగీతం బాగుంది. హరి కె. వేదాంతం సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. నిర్మాతలు సందీప్ ముద్దా, సోనీ పిక్చర్స్ నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి.

విశ్లేషణ:

ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఆపరేషన్ వాలంటైన్ అనేది సినిమా లా చూస్తున్నాం కాబట్టి ఇందులో తప్పొప్పులు చెప్పడం తప్పదు. ఫస్ట్ హాఫ్ అంతా గందరగోళంగా, నత్తనడకగా.. ఎమోషనల్‌గా కనెక్ట్ చేయించలేకపోవడంతో నీరసంగా అనిపిస్తుంది. సెకండాఫ్ ప్రారంభం, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ మాత్రం దేశ భక్తి నరనరాల్లోకి వచ్చేస్తుంది. మన ఎయిర్ ఫోర్స్ గొప్పదనం, ధైర్య సాహసాలు చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మధ్య మధ్యలో నరేంద్ర మోదీ లాంటి పాత్ర ఒకటి అలా కనిపించీ కనిపించకుండా వస్తుంటుంది. ఆపరేషన్ వాలెంటైన్.. ఫస్ట్ హాఫ్ ఫెయిల్.. సెకండాఫ్ సక్సెస్ అన్నట్టుగా ఉంటుంది. టెక్నికల్‌గా కొన్ని సార్లు వావ్ అనిపిస్తుంది. ఇంకొన్ని సార్లు వీఎఫ్ఎక్స్ తేలిపోయినట్టుగా అనిపిస్తుంది. విజువల్స్ బాగున్నాయి. ఇదిఅంతా నిజమేనా? అని నమ్మేట్టుగానే ఉంటుంది. ఓవరాల్ గా డిఫరెంట్ యాక్షన్ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది. ఒక సారి చూడొచ్చు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :