ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

రివ్యూ : 'భీమా' రామా! రామా!!  

రివ్యూ : 'భీమా' రామా! రామా!!  

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థ : శ్రీ సత్యసాయి ఆర్ట్స్
నటీనటులు: గోపీచంద్, మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్,
సీనియర్ నరేష్, పూర్ణ, నాసర్, వెన్నెల కిషోర్, రోహిణి తదితరులు
సంగీత దర్శకులు: రవి బస్రూర్, సినిమాటోగ్రాఫర్‌: స్వామి జె గౌడ
ఎడిటింగ్: తమ్మిరాజు, మాటలు : అజ్జు మహంకాళి
నిర్మాత: కేకే రాధామోహన్, దర్శకుడు: ఏ హర్ష
విడుదల తేదీ : 08.03.2024
నిడివి : 2 ఘంటల 23 నిముషములు

బాక్సాఫీస్ వద్ద గోపీచంద్ క్లీన్ హిట్ కొట్టి చాలా ఏళ్లయింది! ఈ రోజు విడుదలైన ‘భీమా’తో పరీక్షించుకునేందుకు మరోసారి బాక్సాఫీస్ బరిలోకి దిగాడు మ్యాచో స్టార్ గోపీచంద్. కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ భీమా నేడు మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది పూర్తి సమీక్షలో చూద్దాం.

కథ :

భీమా (గోపీచంద్) తనదైన స్టైల్ లో క్రిమినల్స్ ని పట్టుకుని వారి ఆట కట్టించే పోలీస్ అధికారి. అయితే మహేంద్రగిరిని ఏలుతున్న భవాని (ముకేశ్ తివారి) కి అతడు పెద్ద సమస్యగా మారతాడు. ఒకానొక సమయంలో స్కూల్ టీచర్ గా పని చేస్తున్న విద్య (మాళవిక శర్మ)తో తొలిచూపులోనే ప్రేమలో పడతాడు భీమా. అయితే తన మందులతో ఎందరినో కాపాడుతున్న రవీంద్ర వర్మ (నాజర్) అంటే విద్యకు అమితమైన గౌరవం ఉంటుంది. అనంతరం భీమాని రవీంద్ర వర్మ ఒక పనిచేయమని కోరతాడు. అదే పలు పరిస్థితులకు దారి తీస్తుంది, భీమా కథ ‘పరశురామక్షేత్రం’ చుట్టూ తిరుగుతుంది. బెంగుళూరు, బాదామి.. పరిసర ప్రాంతాల్లో జరిగిన కథ. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ‘పరశురామక్షేత్రం’లో ఊహించని ఘటనలు చోటు చేసుకుంటాయి.  మరి ఇంతకీ భీమాని రవీంద్ర వర్మ కోరింది ఏంటి. భవాని కి భీమాకి మధ్య ఏమి జరిగింది, రవీంద్ర వర్మ అప్పగించిన పనితో భీమా ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నాడు,  పోలీస్ ఆఫీసర్ భీమా ఏవిధంగా ఛేదించాడు? అతనికి పరశురామక్షేత్రానికి ఉన్న సంబంధం ఏంటనేదే భీమా కథ. ఈ చిత్రంలో గోపీచంద్.. భీమా, రామా అనే డ్యుయెల్‌ రోల్‌లో కనిపించి సర్ ప్రైజ్ చేశారు. అసలు ఈ రామాకి భీమాకి సంబంధం ఏంటనేది సినిమా లో చూడాల్సిందే.

నటీనటుల హావభావాలు :

గోపీచంద్ అంటే.. చాలా వరకూ ఆయన సినిమాలు రొటీన్ కమర్షియల్ అనే ముద్ర ఉంది. గోపీచంద్ పోలీస్ పాత్రలు చేయడం కొత్తేం కాదు కానీ.. అయితే ‘భీమా’ పోలీస్ ఆఫీసర్‌గా అతని పాత్ర ప్రత్యేకం. గోపీచంద్ ఏ పాత్ర చేసినా అతనిలో సిన్సియారిటీ కనిపిస్తుంది. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్‌ అయితే అతనికి కొట్టినపిండి. కత్తిపడితే నిజంగానే నరుకుతున్నట్టుగా ఉంటుంది.. పిడికిలి బిగిస్తే ఎదుటోడు చచ్చాడ్రోయ్ అనే ఫీల్ కలుగుతుంది. కంటెంట్‌లో పెద్దగా విషయం లేకపోయినా తన కటౌట్‌తో నిలబెట్టేస్తుంటాడు గోపీచంద్. ‘భీమా’లోనూ అదే చేశారు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా.. బ్రాహ్మణుడిగా డిఫరెంట్ షేడ్స్ చూపించారు. ఆయుర్వేద వైద్యుడు రవీంద్ర వర్మగా నాజర్ క్యారెక్టర్‌గా ప్రీ క్లైమాక్స్ వరకూ సర్ ప్రైజింగ్‌గా ఉంటుంది. ఇక ముదురు వయసు బ్రహ్మణ ప్రేమికుడిగా సీనియర్  నరేష్.. తనకి సూటయ్యే పాత్ర చేశాడు. కథను మలుపుతిప్పే పాత్రలో వెన్నెల కిషోర్‌కి మంచి రోల్ పడింది. ఇక సప్తగిరితో పాటు.. సరయు, చమ్మక్ చంద్ర ఇలా చాలామంది ప్యాడింగ్ రోల్స్ లో వున్నారంటే వున్నారు అంతే!

సాంకేతికవర్గం పనితీరు :

దర్శకుడు హర్ష  గోపీచంద్‌లోని మాస్ యాంగిల్‌కి పదునుపెట్టి.. డీవోషనల్ టచ్ ఇచ్చారు. బలమైన కథకు ఇంకా ఏదో ముందు ఉంది అని ప్రేక్షకుల్ని చాలా వరకూ వెయిట్ చేయించిన  ఫస్టాఫ్‌లో అసలు కథ జోలికి పోకుండా.. లవ్ స్టోరీలు, పాటలు, ఫైట్లు, ఎలివేషన్స్‌తోనే లాక్కొచ్చాడు. ఆత్మలు, సంజీవని అంటూ కొత్తగా ట్రై చేశారు.అతను దర్శకుడే కాకుండా కొరియోగ్రాఫర్ కూడా.. గతంలో ఇదే బ్యానర్‌లో వచ్చిన బెంగాల్ టైగర్ సినిమాకి కొరియోగ్రఫీ అందించిన హర్ష ‘భీమా’ చిత్రాన్ని డైరెక్ట్ చేయడంతో పాటు.. రెండు సాంగ్స్‌కి కొరియోగ్రఫీ కూడా అందించడం విశేషం. కన్నడ అనేక హిట్ చిత్రాలను అందించిన ఈ  దర్శకుడు గోపీచంద్‌ని డిఫరెంట్‌గా ప్రజెంట్ చేశారు. పోలీస్ ఆఫీసర్‌‌తో పాటు మరో సర్ ప్రైజింగ్ రోల్‌తో గోపీచంద్‌లోని నట విశ్వరూపాన్ని బయటపెట్టారు. వీఎఫ్ఎక్స్‌ వర్క్‌కి ప్రాధాన్యత కల్పించారు.ఇటీవల వస్తున్న పలు సినిమాల మాదిరిగా మంచి యాక్షన్ సీన్స్, విజువల్స్ తో కూడిన కథగానే భీమా కూడా సాగుతుంది. సినిమాటోగ్రఫీ అందించిన స్వామి జె గౌడ అద్భుతంగా పని చేసారు, ముఖ్యంగా నైట్ సీన్స్ బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ తో పాటు సంగీత దర్శకుడు రవి బస్రూర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చక్కగా కుదిరాయి. ఈ చిత్రం లో  భారీ టెంపుల్ సెట్ హైలైట్! ఎక్కడా రాజి పడకుండా  థకి కావాల్సిన క్వాలిటీ ఇచ్చారు నిర్మాత కేకే రాధామోహన్.  

విశ్లేషణ :

‘భీమ’ కథలో ఫాటసీ ఎలిమెంట్ కొత్తగా అనిపించినా.. దాన్ని కన్వెన్సింగ్‌గా ప్రజెంట్ చేయలేకపోయాడు కన్నడ దర్శకుడు ఏ హర్ష. గోపీచంద్ ఎలివేషన్ సీన్లు.. యాక్షన్ ఎపిసోడ్‌లను అద్భుతంగా వున్నా...   కథ మాత్రం ఆడియన్స్‌కి కనెక్ట్ కాదు. పైగా పాటా.. ఫైటూ.. కుళ్లు కామెడీ.. భీమాని ఆ రొటీన్ కమర్షియల్ పంథాలో నుంచి బయటపడేయలేకపోయాయి. అసలు ఆ గుడి ఏంటి? ఆ నేపథ్యం ఏంటీ..? మధ్యలో శివుడు.. ఆత్మలు.. సంజీవని అంటూ క్లైమాక్స్‌కి వచ్చేసరికి ఏంట్రా ఇది? అని   స్క్రీన్ ప్లే కూడా ఆడియన్స్ కి గందరగోళంగా అనిపిస్తుంది. చివరి అరగంట, ఇంటర్వెల్ సీక్వెన్స్ మరియు రిచ్ విజువల్స్ భీమా యొక్క మెయిన్ హైలైట్స్. ఫస్ట్ హాఫ్ అంతకన్నా పర్వాలేదనిపించినా, దర్శకుడు ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్స్‌తో సెకండ్ హాఫ్ ని బాగానే నడిపించాడు. మాస్ యాక్షన్ సినిమాలు ఇష్టపడేవారు ఈ సినిమా చూసి సంతృప్తి చెందుతారు.   

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :