ASBL NSL Infratech

రాష్ట్ర రాజకీయాలను కుటుంబ రాజకీయాలుగా మారుస్తున్న జనసేనాని..

రాష్ట్ర రాజకీయాలను కుటుంబ రాజకీయాలుగా మారుస్తున్న జనసేనాని..

ముద్రగడ పద్మనాభం కుమార్తె ఆయన గురించి ఓ వీడియో పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్యలు ఉంటాయి.. అయితే కొన్ని కుటుంబాల్లో అవి అనుకోని సందర్భాల్లో బయటపడతాయి.. బహిరంగ సభలో ముద్రగడ కూతురుని పవన్ కళ్యాణ్ పరిచయం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాదు నుంచి పిఠాపురం వచ్చిన పవన్ తన కుటుంబంలో చిచ్చుపెట్టారని ముద్రగడ ఆరోపిస్తున్నారు. నాతో బంధం తెంపుకున్న వ్యక్తిని నా కూతురు అంటూ అతను ఎలా పరిచయం చేస్తాడు.. అని ముద్రగడ నిలదీస్తున్నారు. పెళ్లయిన అమ్మాయి కాబట్టి.. భర్త పేరు లేక అత్తగారి ఇంటి పేరు తోట పరిచయం చేయవచ్చు కదా.. పని కట్టుకొని ముద్రగడ పద్మనాభం కూతురు అని చెప్పడం ఎందుకు అని ఆయన అంటున్నారు.

ఇప్పుడు ఆమెకు ముద్రగడ అన్న ఇంటిపేరు కూడా లేదు అన్న విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాదు ఇదే తరహాలో నేను నీ ఇద్దరు భార్యలను వేదిక మీదకు తెచ్చి ప్రజలకు పరిచయం చేస్తే ఎలా ఉంటుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. మీ కుటుంబంలో ఆడవారికి సంబంధించిన విషయాలు నేను కలగజేసుకుంటున్నానా.. మీ అన్న కూతురు పబ్బులో తాగి డాన్సులు వేసినప్పుడు పోలీసులు పట్టుకెళ్ళలేదా.. అని పద్మనాభం పవన్ పై విరుచుకుపడ్డారు. ఏదన్నా ఉంటే రాజకీయంగా తేల్చుకోవాలి తప్ప ఇలా కుటుంబ సభ్యులను అందునా ఆడవారిని ఇన్వాల్వ్ చేయడం అంత మంచి పద్ధతి కాదు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :