Revanth Reddy: ఎవరికైనా నష్టం జరిగితే.. ఆదుకుంటాం : రేవంత్ రెడ్డి
నల్ల చెరువు అభివృద్ధి చూస్తే ఆనందంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. హైడ్రా (Hydra) పునరుద్ధరించిన కూకట్పల్లి నల్ల చెరువును సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సీఎంగా మీ ముందుకు రావడం ఆనందంగా ఉంది. ఆనాడు ఎంపీగా కూకట్పల్లి (Kukatpally) నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఉన్నా నిధులు లేక చేయలేకపోయా. ఇప్పుడు అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఇస్తాను. చెరువుల పునరుద్ధరణ వల్ల పేదలకు నష్టం కలిగి ఉండవచ్చు. నిర్వాసితుల్లో అర్హులైన పేదలు ఉంటే వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తాం. పేదవాడి ఇల్లు కూల్చడం ప్రభుత్వ ఉద్దేశం కాదు.వరదల వల్ల ఇళ్లు మునిగిపోతే కుటుంబం మొత్తం నష్టపోతుంది. వరద ముప్పును తప్పించాలంటే చెరువులను పునరుద్ధరించాలి. మూసీని పునరుద్ధరించకుంటే భవిష్యత్ తరాలు మునల్ని క్షమించవు. బీజేపీ ప్రభుత్వాలు గంగా, సబర్మతి, సరయూ నదుల అభివృద్ధిని చేపట్టలేదా? మూసీ అభివృద్ధిని మాత్రం ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మూసీ పునరుద్ధరణను వ్య తిరేకించడమంటే రాష్ట్రానికి అన్యాయం చేయడమే. ఎవరికైనా నష్టం జరిగితే మంచి పరిహారం ఇచ్చి ఆదుకుంటాం అని తెలిపారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








