త్వరలో ది ప్యారడైజ్ టీజర్
న్యాచురల్ స్టార్ నాని(Nani), డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దసరా(Dasara) సక్సెస్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ జోడీ ఇప్పుడు ది ప్యారడైజ్(The paradise) తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ వేగంగా కొనసాగుతుండగా, కీలక షెడ్యూళ్లను పూర్తి చేయడంపై చిత్రబృందం దృష్టి పెట్టింది. ఇదే సమయంలో ఫ్యాన్స్ కు ఆసక్తికరమైన అప్డేట్ ఇస్తూ, సినిమా నుంచి త్వరలో స్పెషల్ టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు డైరెక్టర్ హింట్ ఇచ్చారు. ఈ టీజర్లోనే సినిమా కొత్త రిలీజ్ డేట్ ను కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
ఈ సినిమలో నాని గతంలో కనిపించని రఫ్ అండ్ మాస్ అవతార్‌లో కనిపించనున్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. క్యారెక్టరైజేషన్, డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్ అన్నీ కథకు అనుగుణంగా మరింత బోల్డ్‌గా డిజైన్ చేసినట్లు సమాచారం. మరోవైపు మోహన్ బాబు(mohanbabu) ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుండటం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. హీరో- విలన్ మధ్య సాగే ఘర్షణ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది.
భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ సినిమాలో రాఘవ్ జుయాల్(Raghav jhuyal), తనికెళ్ల భరణి(Tanikella bharani), సంపూర్ణేష్ బాబు(sampoornesh babu), బాబు మోహన్(Babu mohan), సోనాలి కులకర్ణి(sonali kulakarni) తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ నిర్మాణ విలువలతో SLV సినిమాస్(SLV Cinemas) ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. యాక్షన్, ఎమోషన్స్, సామాజిక నేపథ్యం కలగలిపిన కథతో రూపొందుతున్న ది ప్యారడైజ్ నాని కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందనే నమ్మకంతో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.








