సైకలాజికల్ మెడికల్ థ్రిల్లర్: ‘డోస్’ మూవీ రివ్యూ!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
కార్పొరేట్ హాస్పిటల్లో డాక్టర్ గా చేస్తున్న ప్రకాశ్ (సిజూ విల్సన్)కి భార్య దివ్య ( కృషా కురూప్) అంటే ప్రాణం. ఆమె అనారోగ్యంతో బాధపడుతూంటుంది. ఇంటిదగ్గర ఒంటిరిగా వదలకుండా ఆమెను హాస్పటిల్ కు తీసుకువస్తూంటాడు. ఇక ప్రకాష్ కు ఓ ప్లాష్ బ్యాక్ లో లవ్ స్టోరీ ఉంటుంది. అతను ప్రేమించిన అరుంధతి (దృశ్య రఘునాథ్) అదే హాస్పటిల్ లో చేస్తూంటుంది. ప్రకాష్ కు హాస్పటిల్ లో మంచి పేరు ఉంటుంది.
ఇక అరుంధతి భర్త పీటర్ మీడియాలో పనిచేస్తూంటాడు. ఇదెలా ఉంటే హాస్పటల్ లో పేషెంట్స్ ఒకరి తర్వాత మరొకరు చనిపోతూంటారు. మొదట్లో ఇది క్యాజువల్ గా అనుకున్నా…అవి సైలెంట్ మర్డర్స్ అని అనుమానం వస్తుంది. ఎందుకంటే కరెక్ట్ గా హెల్త్ సెట్ అవుతున్న టైమ్ లో వాళ్లు చనిపోతూంటారు. దాంతో హాస్పటిల్ కు బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంటుంది.
ఎవరు మర్డర్స్ చేస్తున్నారో అని పోలీస్ లు సైతం సైలెంట్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తూంటారు. అయితే ఎవరు హత్య చేస్తున్నారనే విషయమై అందరిపై అనుమానాలు వస్తూంటాయి. ముఖ్యంగా జూనియర్ డాక్టర్ గా ‘నిఖిల్’పైనే అనుమానాలు వస్తాయి. ఎందుకంటే అతను ఉమనైజర్.పేషెంట్స్ చనిపోతున్న టైమ్ లో అతను ఆ చుట్టుప్రక్కల ఉంటూంటారు. అయితే ఎవరు ఈ హత్యలు చేస్తున్నారనేది పెద్ద సమస్య గా మారుతుంది. ఎవరిని అనుమానించాలో అర్దం కాదు.
ఇవి కూడా చదవండి
ప్రకాష్ ట్రీట్మెంట్ చేస్తున్న పేషెంట్స్ చనిపోవటంతో అతని పరిస్ధితి మరీ దారుణంగా మారతుంది. ఈ క్రమంలో ఎవరు ఈ హత్యలు చేస్తున్నారు. అసలు ఆ హాస్పటల్ లో ఏం జరుగుతోంది.ఈ కేసుని ఎవరికీ తెలియకుండా డీల్ చేద్దామని వచ్చిన పోలీస్ ఆఫీసర్ వివేక్ (అశ్విన్ కుమార్)ఏం కనుక్కున్నాడు.చివరకి ఎవరు ఈ హత్యలకు కారణం అనేది ఎలా తెలుసుకున్నాడు..అసలు ఎవరు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎనాలిసిస్
ఇలాంటి సైక్లాజికల్ థ్రిల్లర్ కథలు ట్విస్ట్ బేసెడ్ స్క్రీన్ ప్లేతో నడుస్తాయి.అంటే క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ సినిమా మొత్తాన్ని ఒంటి చేత్తో నిలబెట్టేస్తుంది.అలాగే థ్రిల్లర్ రైటింగ్‌లో ఇంకో పాపులర్ టెక్నిక్ ఉంది. అదే Red Herring. అంటే ప్రేక్షకుడిని ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించడం. కానీ దానికి ఒక రూల్ ఉంది. ఆ తప్పుదారి కూడా కథలో సహజంగా భాగం కావాలి. ప్రేక్షకుడు రెండోసారి సినిమా చూసినప్పుడు… “అరే… నేను తప్పుగా అర్థం చేసుకున్నా. నేను గమనించనే లేదు” అనిపించాలి. అంతేకానీ డైరెక్టర్ కావాలనే ఇలా చేశాడు.” అనిపించకూడదు.
ఈ సినిమా కూడా దాదాపు అలాంటి ప్రయత్నం చేసింది. మాగ్జిమం సక్సెస్ అయ్యింది. అయితే ఈ సినిమాకు సెటప్ బోర్ కొట్టేస్తుంది. మొదటి అరగంట..విసిగిస్తుంది. మెల్లిగా కథలోకి వెళ్తుంది. కథలో మొదటి చావు వచ్చేదాకా ఏమీ జరగనట్లు ఉండదు. దాంతో సినిమా ఆపేద్దామా అనిపిస్తుంది.మిస్టరీ బిల్డ్ చేసే ప్రాసెస్ లో పాటలు, డైలాగులు, స్లో నేరేషన్, పాత్రలు గురించి మరీ ఎక్కువ పరిచయం చిరాకు తెప్పిస్తాయి. అవి కథకు ఎంత అవసరమైనా ,మనకు అనవసరం కదా.
ఈ సినిమాలో చాలా పాత్రలు,సీన్స్ కావాలనే ప్రేక్షకుడి దృష్టిని మళ్లించడానికి మాత్రమే ఉన్నట్టుగా అనిపిస్తాయి. నర్సులు…జూనియర్ డాక్టర్లు… గత ప్రేమకథ…కొన్ని ఫ్లాష్‌బ్యాక్స్… కొన్ని మాంటేజ్‌లు… ఇవన్నీ కథలో భాగంలా కాకుండా “ఇక్కడ చూడండి… అసలు నేరస్థుడు ఇతనే కావచ్చు” అనే బోర్డులా కనిపిస్తాయి.అందుకే క్లైమాక్స్‌లో అసలు నిజం బయటపడినప్పుడు…”భలే!” అనిపించదు. “సరే…అలా జరిగిందా” అనిపిస్తుంది. ఏదైమైనా మంచి ఐడియా ఉండటం,దాన్ని మంచి స్క్రీన్‌ప్లే తో చెప్పటం రెండు వేర్వేరు విషయాలు.
అయితే ఈ సినిమా ఎక్కువ హడావిడి చేయదు.అతిగా యాక్షన్‌కు వెళ్లదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ప్రతి ఐదు నిమిషాలకు షాక్ ఇవ్వాలని ప్రయత్నించదు.అది ఈ సినిమాకు పెద్ద ప్లస్.
ఫైనల్ థాట్
ఈ సినిమా మంచి థ్రిల్లర్‌లా ప్రేక్షకుడి ఆలోచనలతో ఆడుకోవడం కంటే, అనుమానితుల లిస్ట్ ను మాత్రమే మారుస్తూ వెళ్తుంది. చివర్లో ట్విస్ట్ ఉంటుంది… దాంతో సినిమా నుంచి బయటకు వచ్చాక గుర్తుండేది ఆ ట్విస్ట్ ఒక్కటే.
చూడచ్చా
మనకు పరిచయం లేని ఆర్టిస్ట్ లు కాబట్టి కాస్త మొదట్లో విసిగించినా, మెల్లిగా కథ ఎక్కుతుంది. ట్విస్ట్ ఊహించం కాబట్టి థ్రిల్లర్ లవర్స్ ఓ లుక్కేయచ్చు.
ఎక్కడ చూడచ్చు
‘అమెజాన్ ప్రైమ్’తో పాటు లైన్స్ గేట్ ప్లే .. ‘ఆహా’లోను తెలుగు వెర్షన్ తో అందుబాటులో ఉంది.
ఇవి కూడా చదవండి








