టీటీఏ మహా సభలకు భారీగా విరాళాలు.. దాతలు, స్పాన్సర్లను ఘనంగా సన్మానించిన టీటీఏ
అమెరికాలోని చార్లెట్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగిన ‘తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్’ మెగా కన్వెన్షన్ 2026 ఘనంగా ముగిసింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలు ప్రవాస తెలుగువారిలో నూతన ఉత్సాహాన్ని నింపాయి. ఈ కార్యక్రమం ఇంతటి విజయవంతం కావడానికి అంకితభావంతో పనిచేసిన టీటీఏ నాయకత్వంతో పాటు, ఉదారంగా విరాళాలు అందించిన దాతల పాత్ర మరువలేనిది.
సమాజ సేవ, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడాలనే లక్ష్యంతో వ్యాపారవేత్తలు, సామాజిక నాయకులు, స్పాన్సర్లు, టీటీఏ ముఖ్య నాయకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భారీ నిధులను సమకూర్చారు. ఈ సందర్భంగా దాతలు, స్పాన్సర్లను టీటీఏ బృందం ఘనంగా సన్మానించింది.
లక్ష డాలర్ల విరాళం అందించిన వారు…
శ్రీ డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి: టీటీఏ సంస్థను 11 ఏళ్ల క్రితం ఒక చిన్న ఆశయంతో ప్రారంభించిన టీటీఏ ఫౌండర్, విద్యావేత్త డాక్టర్ శ్రీ పైళ్ల మల్లారెడ్డి, ఇవాళ టీటీఏను అమెరికాలోని నంబర్ వన్ తెలుగు సంస్థగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారు. ఆయన సతీమణి శ్రీమతి సాధన రెడ్డి. పైళ్ల మల్లారెడ్డి కేవలం ఒక ఫౌండర్గానే కాకుండా, ప్రవాస తెలుగువారికి స్ఫూర్తిప్రదాతగా నిలుస్తున్నారు. విద్య, సామాజిక సేవా రంగాల్లో ఆయన చేస్తున్న కృషి అసాధారణం. టీటీఏ సంస్థకు ఆయన ఒక పెద్దన్నలా ఉంటూ, ఎగ్జిక్యూటివ్ కమిటీకి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు నిరంతరం దిశానిర్దేశం చేస్తుంటారు. ప్రతి మెగా కన్వెన్షన్‌లోనూ నిధుల సేకరణలో, సంస్థ విస్తరణలో స్వయంగా పాలుపంచుకుంటారు. అమెరికాలో స్థిరపడిన తెలుగువారు అభివృద్ధిలో కూడా భాగస్వాములు కావాలని ఆయన నిరంతరం ప్రోత్సహిస్తుంటారు.
శ్రీ నవీన్ రెడ్డి మలిపెద్ది: టీటీఏ ప్రస్తుత అధ్యక్షుడు శ్రీ నవీన్ రెడ్డి మలిపెద్ది గారు, తన అద్భుతమైన నాయకత్వ పటిమతో సంస్థను మరో స్థాయికి తీసుకెళ్లారు. కేవలం ఈ కన్వెన్షన్ నిర్వహణలోనే కాకుండా, గత ఆరు నెలలుగా ఆయన చేసిన కృషి వర్ణనాతీతం. దాతలను కలిసి నిధులు సమకూర్చడం, కన్వెన్షన్ సెంటర్లో ప్రతి నిమిషం జరిగే కార్యక్రమాలను పర్యవేక్షించడం, వేలమంది అతిథులను సమన్వయం చేయడంలో ఆయన చూపిన చొరవ అభినందనీయం. యువ నాయకుడైన నవీన్, టీటీఏలో కొత్త రక్తాన్ని నింపుతూ, ముఖ్యంగా యువతను, తదుపరి తరాన్ని సంస్థ వైపు ఆకర్షించడంలో విజయం సాధించారు. కన్వెన్షన్ విజయవంతం కావడానికి ఆయన రేయింబవళ్లు శ్రమించడమే కాకుండా, కన్వీనర్ శ్రీ ప్రవీణ్ చింత, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లతో కలిసి టీమ్ వర్క్‌ను చక్కగా సమన్వయం చేశారు.
రాజ పుష్ప (శ్రీ చంద్రమౌళి, శ్రీ శాంతికిరణ్): ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ రాజ పుష్ప గ్రూప్ మేనేజింగ్ పార్ట్నర్లు. వీరిద్దరూ వ్యాపార రంగంలో రాణిస్తూనే, తెలుగు సంస్కృతిని ప్రోత్సహించేందుకు వీరు ఎల్లప్పుడూ ముందుంటారు.
50 వేల డాలర్లు విరాళం అందించిన స్పాన్లర్లు, దాతలు…
శ్రీ వంశీ రెడ్డి: ఈయన టీటీఏ మాజీ అధ్యక్షుడు, సంస్థ బలోపేతానికి నిరంతరం శ్రమిస్తున్నారు.
శ్రీ ప్రవీణ్ చింత: టీటీఏ కన్వెన్షన్ కన్వీనర్ శ్రీ ప్రవీణ్ చింత గారు సుమారు 40కి పైగా నగరాలు పర్యటించి, కన్వెన్షన్ కోసం భారీగా నిధులు సమీకరించడంలో కృషి చేశారు.
శ్రీ డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి: వైద్య రంగంలో విశేష సేవలందిస్తూ, సామాజిక కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్న ప్రముఖులు.
శ్రీ అజయ్ గోవాడ(First Infra): టీటీఏ అభివృద్ధిలో క్రియాశీలకంగా ఉంటూ తనవంతు సహకారం అందిస్తున్న నాయకులు.
శ్రీ కిశోర్ కంచర్ల: వ్యాపారవేత్తగా ఉంటూనే సంస్థాభివృద్ధికి, కన్వెన్షన్ నిర్వహణకు మద్దతునిచ్చారు. ఈయన ప్రస్తుతం నాట్స్ అధ్యక్షుడిగా ఉన్నారు.
శ్రీ నరేంద్ర దేవరపల్లి: కన్వెన్షన్ కోఆర్డినేటర్‌గా ఉంటూ కార్యక్రమ విజయానికి శ్రమించిన కీలక బాధ్యులు.
శ్రీ సురేష్ బత్తినేని: సంస్థ ఆశయాలకు అనుగుణంగా ఆర్థిక, సామాజిక బాధ్యతలను నెరవేరుస్తున్న ప్రముఖులు.
శ్రీ రాజు పగడాల (ప్రైమ్ డెవలపర్స్): ప్రైమ్ డెవలపర్స్ ద్వారా అనేక అభివృద్ధి పనుల్లో భాగస్వాములవుతూ, టీటీఏ సంస్థకు గొప్ప చేయూతనందించారు.
శ్రీ మోహన్ పాటలోళ్ల: సంస్థాభివృద్ధి కోసం, కన్వెన్షన్ విజయవంతం కోసం నిరంతరం కృషి చేస్తున్న సీనియర్ నాయకులు.
శ్రీ మహేందర్ ముసుకు: ప్రవాస తెలుగువారిని ఐక్యం చేయడంలో, టీటీఏ లక్ష్యాల సాధనలో ఈయన క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు.
శ్రీ ఎంఎస్ఎన్ రియాలిటీ (వెంకట రమణ): రియల్ ఎస్టేట్ రంగంలో గుర్తింపు పొందిన ఈ సంస్థ, టీటీఏ సామాజిక బాధ్యతను పంచుకోవడంలో ముందుంది.
శ్రీ రవి – శ్రీ నాగార్జున: ఎక్స్‌పాట్ (XPAT) సంస్థ ప్రతినిధులుగా, కన్వెన్షన్ నిర్వహణలో తమదైన ముద్ర వేస్తూ ఈయన తన సహకారాన్ని అందించారు.








