ఆటా మహాసభల సాహిత్య సదస్సులో పాల్గొంటున్న ప్రముఖులు వీరే..
ATA: అమెరికాలోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో జులై 31 నుంచి ఆగస్టు 2, 2026 వరకు నిర్వహించనున్న 19వ ‘అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (ATA) అంతర్జాతీయ సమావేశాలు , యువ సమ్మేళనం కోసం సర్వం సిద్ధమైంది. ఈ వేడుకల్లో భాగంగా ఆటా సాహిత్య విభాగం ఆధ్వర్యంలో సాహిత్య కార్యక్రమాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. తెలుగు భాషాభిమానుల కోసం పలువురు ప్రముఖ కవులు, రచయితలు, విద్యావేత్తలు ఈ కన్వెన్షన్లో పాల్గొననున్నారు.
సాహిత్య విభాగంలో పాల్గొంటున్న ప్రముఖులు..
ఈ కార్యక్రమానికి పలువురు విద్వాంసులు హాజరవుతున్నారు. వారిలో డా. నరాల రామారెడ్డి, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, కొల్లారపు ప్రసాద్ రావు శర్మ, డా. రాజేశ్వర్రావు టేక్మాల్, కాసర్ల శ్యామ్, అప్సర్, సురేష్ కొలిచాల, డా. రెంటాల జయదేవ, సురేందర్ మిట్టపల్లి, డా. ఈమని శివనాగిరెడ్డి, వామరాజు సత్యమూర్తి, డా. నరసింహా రెడ్డి ఉరిమిండి, వెంకట్ కొత్తూర్, రాజేశ్వరి దివాకర్ల, డా. జననీ కృష్ణ, పారుపల్లి కోదండరామయ్య, డా. లక్ష్మి గోపరాజు, కల్పన రెంటాల, డా. సాధు గోపాలకృష్ణ, భాను ప్రకాష్ మాగులూరి ఉన్నారు.
కమిటీ, నిర్వహణ..
ఈ సాహిత్య కార్యక్రమాల విజయవంతానికి ‘లిటరరీ కమిటీ’ కృషి చేస్తోంది. వేణు నక్షత్రం చైర్మన్గా వ్యవహరిస్తుండగా, సూర్య నాంపల్లి, రాజ్ కుమార్ కో-చైర్మన్లుగా ఉన్నారు. జయదేవ్ మెట్టుపల్లి, ప్రకాష్ తిమ్మాపురం, రాజేశ్వర్ రావు టేక్మాల్ అడ్వైజర్లుగా వ్యవహరిస్తున్నారు. జయంత్ చల్లా (అధ్యక్షుడు), శ్రీధర్ బానాల (కన్వీనర్), రవి చల్లా (కోఆర్డినేటర్), శరత్ వేముల (నేషనల్ కోఆర్డినేటర్), సుధీర్ దామిడి (డైరెక్టర్) , కోర్ కమిటీ సభ్యులు జైనత్ కుందూర్, అరవింద్ ముప్పిడి, కౌశిక్ సామ, తిరుమల్ రెడ్డి మునుకుంటల, కిరణ్ అల ఈ భారీ కన్వెన్షన్ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ప్రవాసాంధ్రులలో తెలుగు సాహిత్య స్ఫూర్తిని పెంపొందించేందుకు ఉద్దేశించిన ఈ 19వ ఆటా కన్వెన్షన్, బాల్టిమోర్ నగరంలో తెలుగు భాషా వైభవాన్ని చాటిచెప్పే వేదికగా నిలవనుంది.








