TTA మహా సభలలో తెలుగు టైమ్స్ ప్రత్యేక సంచిక విడుదల..
గత 23 ఏళ్లుగా అమెరికా లో జరిగే ప్రతి తెలుగు మహా సభలకు తెలుగు టైమ్స్ ప్రత్యక్షంగా పాల్గొంటుందని, మీడియా పార్టనర్ గా వ్యవహరిస్తుందని, ప్రత్యేక సంచిక ప్రచురించి అందరినీ అలరిస్తుందన్న విషయం అందరికీ తెలుసు.
చార్లెట్ నగరంలో 17 – 19 జూలై తేదీలలో జరిగే TTA Maha సభలలో తెలుగు టైమ్స్ కాన్ఫరెన్స్ ప్రత్యేక సంచిక ప్రచురించి, దాదాపు వెయ్యి కాపీలను చార్లెట్ చేరవేసింది.
TTA అడ్వైజరీ కౌన్సిల్ అధ్యక్షులు శ్రీ విజయపాల్ రెడ్డి, అడ్వైజరీ ప్యానెల్ సభ్యులు శ్రీ మోహన్ పాటల్లోల, శ్రీ భరత్ మందాడి, శ్రీ వంశీ రెడ్డి, అధ్యక్షులు శ్రీ నవీన్ రెడ్డి మలిపెద్ది ల సమక్షంలో తెలుగు టైమ్స్ ఎడిటర్ శ్రీ సుబ్బారావు చెన్నూరి తదితరుల సమక్షంలో వ్యవస్థాపకులు డా. ఫైళ్ళ మల్లారెడ్డి గారు తెలుగు టైమ్స్ ప్రత్యేక సంచిక ఆవిష్కరించి తెలుగు టైమ్స్ ను అభినందించారు.
ఈ మహాసభలలో తెలుగు టైమ్ కాపీలు అందరికీ పంచుతున్నామని అందరి ప్రశంసలు అందుకుంటున్నామని, శ్రీ సుబ్బారావు తెలిపారు. అదే విధంగా తెలుగు టైమ్స్ ePaper ఇప్పటికే అందుబాటులో ఉందని తెలిపారు.








