బాల్టిమోర్ వేదికగా త్వరలో ‘ఆటా’ వైద్య సదస్సు..
అమెరికాలోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో జులై 31 నుంచి ఆగస్టు 2, 2026 వరకు నిర్వహించనున్న 19వ ‘అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (ఆటా) అంతర్జాతీయ సమావేశాలు , యువ సమ్మేళనంలో భాగంగా, వైద్య రంగంలో అత్యాధునిక అంశాలపై ‘కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్’ (సీఎంఈ) సదస్సులను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో వైద్య రంగంలోని వివిధ విభాగాలకు చెందిన ప్రముఖ నిపుణులు పాల్గొని, ప్రస్తుత ఆరోగ్య సవాళ్లు , భవిష్యత్ చికిత్సా విధానాలపై చర్చించనున్నారు.
వైద్య రంగ నిపుణుల సదస్సు…
ఈ సదస్సుకు ‘ప్రైమ్ హెల్త్‌కేర్’ ఫౌండర్, ఛైర్మన్, సీఈఓ డా.ప్రేమ్ రెడ్డి గౌరవ అతిథిగా హాజరుకానున్నారు. పలువురు నిపుణులు కీలక అంశాలపై ప్రసంగించనున్నారు. డా. గురునాథ్ రెడ్డి, డా. సురేష్ రెడ్డి, డా. వేణుమాధవ్ రెడ్డి కోట్ల, డా. సతీష్ కాతుల, డా. కిషోర్ బెల్లంకొండ, డా. రమ్య మోసార్, డా. మహాదేవప్ప హునసికట్టి, డా. శ్రీనాగేష్ పలువోయ్, డా. సుమన్ మంచిరెడ్డి, డా. ఎం.ఎస్.రెడ్డి, డా.అరుల్ విగ్, డా.సుజీత్ పున్నం, డా.మెహర్ మెడవరం ఈ సదస్సులో కీలక చర్చల్లో పాల్గొననున్నారు.








