జులై 18న ‘తానా’ & ‘డీటీఏ’ ఆధ్వర్యంలో క్యారమ్స్ పోటీలు
TANA: తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TANA) , డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ (DTA) సంయుక్తంగా క్యారమ్స్ పోటీలను నిర్వహిస్తున్నాయి. ఈ క్రీడా పోటీలు జులై 18వ తేదీన, ఉదయం 9:30 గంటల నుండి నోవి, మిచిగాన్లోని శ్రీ వేంకటేశ్వర దేవాలయంలో జరగనున్నాయి.
కేటగిరీలు..
పురుషుల సింగిల్స్, పురుషుల డబుల్స్ , మహిళల సింగిల్స్ విభాగాల్లో పోటీలు ఉంటాయి.
రిజిస్ట్రేషన్ వివరాలు..
ఒక్కో క్రీడాకారుడికి రిజిస్ట్రేషన్ ఫీజు 20 డాలర్లుగా నిర్ణయించారు. ఆసక్తి గలవారు క్యూఆర్ కోడ్ (QR code) ద్వారా నమోదు చేసుకోవచ్చు. విజేతలకు 1000 డాలర్ల వరకు నగదు బహుమతులు , ట్రోఫీలను అందజేయనున్నారు.
ఈ కార్యక్రమానికి తానా , డీటీఏ నాయకులు మద్దతు తెలుపుతున్నారు. మరిన్ని వివరాల కోసం రాజా తొట్టెంపూడి (510-862-6399) లేదా మంజీర పాలడుగు (313-515-3298)ని సంప్రదించవచ్చు.








