మూసారాంబాగ్ హైలెవల్ బ్రిడ్జిని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మూసారాంబాగ్ హైలెవల్ బ్రిడ్జిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ బ్రిడ్జిని రూ.52 కోట్ల వ్యయంతో 400 మీటర్ల పొడవుతో నిర్మించగా.. సీఎం నేడు ప్రారంభోత్సవం చేశారు. మూసీ నదిలో లక్షా యాభై వేల క్యూసెక్కుల వరద వచ్చినా ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా పటిష్ఠంగా దీనిని నిర్మించారు. ఈ బ్రిడ్జితో అంబర్పేట, మూసారాంబాగ్ ప్రాంతాలకు ప్రయాణాలు సులభం కానున్నాయి.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు, ఎంపీ లు అసదుద్దీన్ ఒవైసీ,అనిల్ కుమార్ యాదవ్,అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ , జూబ్లీహిల్స్ ఎంఎల్ ఏ నవీన్ యాదవ్ , ఎంఎల్ ఏ మల్ రెడ్డి రంగా రెడ్డి,మాజీ ఎంపీ మధు యాష్కీ,ప్రభుత్వ ఉన్నతాధికారులు.








