ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ న్యూయార్క్ పర్యటనల్లో…
న్యూయార్క్‌లోని మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్లో యూనివర్సల్ వన్నెస్ సెలబ్రేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చినప్పటి నుంచి కార్యక్రమం విజయవంతంగా పూర్తయ్యేంతవరకు న్యూయార్క్ లో వివిధ రకాల మాటలు వినిపించాయి. ఓవైపు నిరసనలు, మరోవైపు కార్యక్రమ నిర్వాహకుల ఉత్సాహం వంటివి చోటు చేసుకున్నాయి. ఈ కార్యక్రమం పట్ల అమెరికాకు చెందిన 60 మానవ హక్కులు, పౌర హక్కుల మతాంతర సంస్థలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశాయి. న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ కూడా మోహన్ భగవత్ పర్యటనను మరియు ఆరెస్సెస్ భావజాలాన్ని బహిరంగంగా వ్యతిరేకించారు. ప్రైవేట్ కార్యక్రమం కావడంతో దీనిని రద్దు చేసే అధికారం తనకు లేకపోయినప్పటికీ ఈ సభకు తన మద్దతు లేదు అని ప్రకటించుకున్నాడు. కాని ఆయన మాటకు వ్యతిరేకంగా కొందరు గళం కూడా విప్పారు. మరోవైపు నిరసనలు తెలియజేసిన ఈ 60 సంస్థలు ఏవీ? అని ఒక సారి లుక్ వేస్తే…
ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్, హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్, ఇంటర్ఫెయిత్ సెంటర్ ఆఫ్ న్యూయార్క్, ఎమ్గేజ్ (అమెరికన్ ముస్లిం కోసం పనిచేసే ఆర్గనైజేషన్)..అమెరికన్ సిక్కు కాకస్ కమిటీ, యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ లాంటివి ఉన్నాయి… వీటిని గూగుల్ చేస్తే ఇవన్నీ మన దగ్గర ఉండే సూడోస్ లిబరల్స్ సెక్యులర్స్ నడిపే సంస్థల్లాంటివే…..
మరోవైపు మోహన్ జీ భాగవత్ కార్యక్రమం విజయవంతం చేయడం కోసం హిందూ-అమెరికన్ సంస్థలు, ప్రవాస భారతీయ సంఘాలు ఉదాహరణకు అహెడ్ ఫోరమ్, ఇండియన్ అమెరికన్ గ్రూప్స్ రెండు మూడు నెలలలు గా కష్టపడుతూ ఉన్నాయి. స్వామి వివేకానంద 1893 సెప్టెంబర్ 11న అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన సర్వమత మహాసభలో ప్రసంగం చేసిన విధానం గుర్తు చేస్తూ హిందువులకు / భారతీయులకు ఎవరి మీద ఎలాంటి ద్వేషపూరితమైన ఆలోచన లేదని, భారతీయ సనాతన ధర్మ సిద్ధాంతమైన “వసుధైక కుటుంబకం” (ప్రపంచమంతా ఒకే కుటుంబం) అనే నినాదంతో, భిన్నత్వం మరియు సామరస్యాన్ని జరుపుకోవడానికే ఈ ‘యూనివర్సల్ వన్నెస్ సెలబ్రేషన’ నిర్వహిస్తున్నామని నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం వద్దు అని 60 సంస్థలు నిరసన వ్యక్తం చేస్తూంటే కార్యక్రమం కోసం 200 సంస్థలు పనిచేశాయి.
సోర్స్…విలాస్ జంబుల








