19వ ఆటా మహాసభల్లో మహిళల కోసం ప్రత్యేకంగా ‘ఉమెన్స్ ఫోరమ్’ వేడుకలు
ATA: అమెరికాలోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జులై 31 నుండి ఆగస్టు 2, 2026 వరకు జరగనున్న 19వ అమెరికన్ తెలుగు సంఘం (ATA) కాన్ఫరెన్స్ , యూత్ కన్వెన్షన్ వేడుకల్లో భాగంగా మహిళల కోసం ప్రత్యేకంగా ‘ఉమెన్స్ ఫోరమ్’ (Women’s Forum) కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ వేదికపై మహిళల కోసం ప్రత్యేక ఏర్పాటు చేశారు.
డోర్ బస్టర్స్ (Door Busters): ప్రతి బహుమతి విలువ $100కి పైగా ఉండనుంది. అంతేకాకుండా $50కి పైగా విలువైన రాఫెల్ బహుమతులు (Raffle Prizes) గెలుచుకునే అవకాశం ఉంది.
ప్రత్యేక ఆకర్షణలు: చీరెలు, ఆభరణాలు, బ్రాండెడ్ బ్యాగ్లు తదితర ఎన్నో ఆకర్షణీయమైన బహుమతులు అందజేయనున్నారు.
రెండు రోజుల ప్రత్యేక కార్యక్రమాలు..
డే 1: ‘లెవల్ అప్ యువర్ హస్టిల్ విచ్ఛాయ్’ (Level Up Your Hustle with Chai) పేరుతో మధ్యాహ్నం 2:00 నుండి 4:30 గంటల వరకు (రూమ్ నెం. 321 & 322) సమావేశం జరగనుంది. ఇందులో నేటి జీవితంలో AI ప్రాముఖ్యత, నేటి ప్రపంచంలో పేరెంటింగ్ తదితర అంశాలపై చర్చిస్తారు.
డే 2: ‘బాస్ హెర్ అప్ విత్ మాక్టెయిల్స్’ (Boss Her Up with Mocktails) పేరుతో మధ్యాహ్నం 2:00 నుండి 4:30 గంటల వరకు (రూమ్ నెం. 321 & 322) కార్యక్రమం ఉంటుంది. ఇందులో ఆరోగ్యకరమైన వృద్ధాప్యం, స్వీయ సంరక్షణ, పెట్టుబడులు , ఆర్థిక నిర్వహణ అంశాలపై చర్చిస్తారు.
అమెరికాలో నివసించే తెలుగు మహిళలందరూ ఈ ప్రత్యేక వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా నిర్వాహకులు కోరుతున్నారు.








