ఆయన సేవలను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు : రేవంత్ రెడ్డి
రాజనీతితో కూడిన రాజకీయం చేసిన మహోన్నత నాయకుడు జైపాల్ రెడ్డి (Jaipal Reddy) అని, ఆయన సేవలను తెలంగాణ (Telangana) ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. జైపాల్ రెడ్డి వర్థంతి సందర్భంగా సీఎం నివాళులర్పించారు. విలువలు, సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజా జీవితాన్ని గడిపిన ప్రజానేత. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా దేశవ్యాప్తంగా విశిష్ట గుర్తింపు పొందిన నాయకుడు. పార్లమెంట్ ( Parliament)లో తన వాక్చాతుర్యం, విషయ పరిజ్ఞానంతో ప్రత్యేక ముద్ర వేసిన నేత. రాజకీయ నైతికతకు ప్రతీకగా నిలిచిన నాయకుడు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు నిరంతరం కృషి చేసిన వ్యక్తి. ఆయన ప్రజాసేన, ఆదర్శాలు భావితరాలకు స్ఫూర్తిదాయకం. జైపాల్ రెడ్డి వర్థంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. ఆయన ఆశయాలను కొనసాగించడం ద్వారానే నిజమైన నివాళి అర్పించిన వారమవుతాం అని సీఎం పేర్కొన్నారు.








