సింపుల్ లుక్ లో మెరిసిపోతున్న పూజా
ఒక లైలా కోసం(Oka laila kosam) సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమైన పూజా హెగ్డే(Pooja hegde) తన అందం, అభినయంతో తక్కువ టైమ్ లోనే మంచి పేరు సంపాదించుకుంది. ఈ మధ్య సినిమాల ఎంపికలో కాస్త తడబడటంతో వరుస ఫ్లాపులు ఎదుర్కొంటుంది. అయినప్పటికీ పూజాకీ అవకాశాలొస్తూనే ఉన్నాయి. కెరీర్ పరంగా ఎలా ఉన్నా పూజా తన సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్లకు తన అప్డేట్స్ ను ఇస్తూనే ఉంటుంది. అందులో భాగంగానే పూజా తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో బ్రౌన్ కలర్ టూ పీస్ కో ఆర్డ్ సెట్ ధరించి ఎంతో అందంగా కనిపించింది. ఈ అవుట్‌ఫిట్ కు తగ్గట్టుగా గోల్డ్ చైన్, చోకర్ నెక్లెస్, చేతికి బ్రేస్లెట్స్ వేసుకుని సింపుల్ గా కనిపిస్తూనే ఫ్యాన్స్ ను తెగ ఎట్రాక్ట్ చేస్తోంది.








