రాకా కొత్త షెడ్యూల్‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu arjun), డైరెక్టర్ అట్లీ(Atlee) కాంబినేషన్లో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా సినిమా రాకా(Raaka)పై ఫ్యాన్స్ లో రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్, సెట్స్ నిర్మాణం విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్న చిత్రబృందం, ఇప్పుడు కొత్త షూటింగ్ షెడ్యూల్‌కు సిద్ధమైనట్లు ఇండస్ట్రీ వర్గాల్లో డిస్కషన్ సాగుతోంది. ఈ దశలో కథకు కీలకమైన సీన్స్ తో పాటు హీరో పరిచయాన్ని అత్యంత స్టైలిష్‌గా తెరకెక్కించే ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. ముఖ్యంగా ఈ ఎపిసోడ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన భారీ సెట్ సినిమాకే మెయిన్ ఎట్రాక్షన్ గా నిలవనుందనే ప్రచారం వినిపిస్తోంది.
ఈ షెడ్యూల్లో అల్లు అర్జున్ ఎంట్రీ సీక్వెన్స్‌ను అత్యంత పవర్‌ఫుల్‌గా షూట్ చేయనున్నట్టు టాక్. బన్నీని ఇప్పటివరకు చూడని వైల్డ్ లుక్‌లో చూపించేందుకు అట్లీ స్పెషల్ డిజైన్ రెడీ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, భారీ యాక్షన్ బ్లాక్స్, హై ఎండ్ టెక్నికల్ ఎగ్జిక్యూషన్‌తో ఈ సీన్స్ రూపొందనున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. సినిమాకు విజువల్ స్కేల్‌ను మరింత పెంచేలా ఈ ఎపిసోడ్ ఉండబోతుందని సమాచారం.
సన్ పిక్చర్స్(Sun pictures) నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాలో దీపికా పడుకోణె(Deepika padukone) మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా, మృణాల్ ఠాకూర్(Mrunal thakur), జాన్వీ కపూర్(Jhanvi Kapoor) కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మాఫియా ప్రపంచాన్ని నేపథ్యంగా తీసుకుని డాన్ చుట్టూ కథ నడుస్తుందనే అంచనాలు ఉన్నాయి. అఫీషియల్ గా ఇంకా స్టోరీ డీటెయిల్స్ బయటకు రాకపోయినా, స్టార్ కాస్ట్, భారీ నిర్మాణ విలువలు, అట్లీ మార్క్ కమర్షియల్ ట్రీట్మెంట్ కారణంగా రాకా పై దేశవ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది.








