తెలంగాణ అభివృద్ధికి ఎన్నారైలు ముందుకురావాలి… కాలిఫోర్నియాలో మంత్రి సీతక్క
బాపూజీ స్ఫూర్తితో ఎన్నారైలు తెలంగాణ గ్రామీణాభివృద్ధికి సహకరించాలని తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కోరారు. కాలిఫోర్నియా పర్యటనలో భాగంగా ఫ్రీమాంట్లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని అన్నారు. సీఎం కృషికి చేయూతగా ప్రవాసులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని, గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా సేవా కార్యక్రమాలు, ఉపకారవేతనాలు, తాగునీటి సరఫరా, మౌలిక వసతుల కల్పనకు చొరవ చూపాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
మహిళల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి, ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రతినిధులు సందీప్ వంగల, నెమలి మాధవ, శ్రీనివాస్ రామసహాయం, గూడూరు రవీందర్ రెడ్డి, గీతా చౌదరితోపాటు కాలిఫోర్నియాలో ఉంటున్న పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి








