బొండా ఉమా వివరణ తీసుకోండి : సీఎం చంద్రబాబు ఆదేశం
వైసీపీ నేతలతో కలిసి టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు (Bonda Umamaheswara Rao) వేదిక పంచుకోవడాన్ని పార్టీ అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. దీనిపై ఆయన వివరణ తీసుకోవాలని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు( Chandrababu) ఆదేశించారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ( Palla Srinivasa Rao), మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu)కు ఆ బాధ్యత అప్పగించారు. వైసీపీ నేతలతో వేదిక పంచుకోవద్దని గతంలోనే టీడీపీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గుంటూరులో జరిగిన సమావేశంలో వైసీపీ నేతలతో కలిసి బొండా ఉమా వేదికను పంచుకోవడం చర్చనీయాంశమైంది.
ఇవి కూడా చదవండి








