టీటీఏ మెగా కన్వెన్షన్‌లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎగ్జిబిషన్ల సందడి..
చార్లెట్లో జరుగుతున్న ప్రతిష్టాత్మక టీటీఏ మెగా కన్వెన్షన్ 2026లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రవాస తెలుగువారికి హైదరాబాద్‌లోని అత్యాధునిక నివాస ప్రాజెక్టులు , పెట్టుబడి అవకాశాలను పరిచయం చేసేందుకు నిర్వాహకులు ఈ ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు.
కన్వెన్షన్‌లో ఎంఎస్ఎన్ రియాలిటీ, వీకేఆర్ వెంచర్స్, ఫోర్ ఓక్స్ ఇన్సూరెన్స్ గ్రూప్ వంటి సంస్థలు కన్వెన్షన్ వేదికగా ఎగ్జిబిట్లను ప్రదర్శించాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను ప్రవాస తెలుగువారికి దగ్గర చేయడం ద్వారా, ఈ కన్వెన్షన్ పెట్టుబడిదారులకు ఒక చక్కని వేదికగా నిలుస్తోంది.








