టైఫాయిడ్ జ్వరం తగ్గిన తర్వాత కూడా శరీరంలో తీవ్రమైన నీరసం ఉంటుంది. దీనిని తగ్గించడానికి సరైన పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం.
అన్నం, పెసరపప్పు కలిపి చేసిన మెత్తని కిచిడి తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది, ఇది సులభంగా జీర్ణమవుతుంది.
పెసరపప్పు కిచిడి
శరీరంలో కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్ తిరిగి పొందడానికి, నీరసం తగ్గడానికి రోజూ కొబ్బరి నీళ్లు తాగడం చాలా మంచిది.
కొబ్బరి నీళ్లు
బాగా పండిన అరటిపండ్లలో పొటాషియం, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి తక్షణ శక్తిని అందించి అలసటను దూరం చేస్తాయి.
అరటిపండు
దీనిలో ఉండే పిండి పదార్థాలు నీరసాన్ని తగ్గించి, శరీరానికి తగిన బలాన్ని, శక్తిని ఇస్తాయి.
ఉడికించిన బంగాళాదుంప
క్యారెట్, సొరకాయ వంటి కూరగాయలతో తయారు చేసిన సూప్ తాగడం వల్ల తేలికగా పోషకాలు అందుతాయి.
వెజిటబుల్ సూప్
ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఉడికించిన గుడ్డులోని తెల్లసొన తినడం వల్ల కండరాలు బలపడి శక్తి వస్తుంది.
ఉడికించిన గుడ్లు
పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ పేగులను ఆరోగ్యంగా ఉంచి, జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి.
పెరుగు
పచ్చి యాపిల్ కంటే తొక్క తీసి ఉడికించిన యాపిల్ తినడం వల్ల త్వరగా జీర్ణమై శక్తి అందుతుంది.
ఉడికించిన యాపిల్
నూనె, కారం, మసాలాలు ఉన్న బయటి ఆహారాలకు దూరంగా ఉంటూ, వేడివేడిగా ఇంట్లోనే వండుకున్న తేలికపాటి ఆహారం తినాలి
ముఖ్య గమనిక