ఇంట్లోని జిడ్డు, మరకలను వదిలించడానికి బేకింగ్ సోడా అద్భుతంగా పనిచేస్తుంది. దీనితో చేసే కొన్ని సులభమైన క్లీనింగ్ హ్యాక్స్ ఇక్కడ ఉన్నాయి.
స్టవ్ మీద పడిన జిడ్డు మరకలపై బేకింగ్ సోడా, నిమ్మరసం చల్లి కాసేపు ఆగి తుడిస్తే తళతళ మెరిసిపోతుంది.
స్టవ్ టాప్ క్లీనింగ్
ఒక గిన్నెలో నీరు, బేకింగ్ సోడా వేసి మైక్రోవేవ్‌లో వేడి చేయాలి. ఆవిరి ద్వారా లోపలి మలినాలు సులభంగా తొలగిపోతాయి.
మైక్రోవేవ్ క్లీనింగ్
గోడలు లేదా నేల మీద ఉన్న టైల్స్ నల్లటి మరకలపై బేకింగ్ సోడా పేస్ట్ రాసి బ్రష్‌తో రుద్దితే కొత్తవాటిలా మారుతాయి.
టైల్స్ తెల్లగా మారడానికి
కిచెన్ సింక్‌లో బేకింగ్ సోడా వేసి వేడి నీరు పోస్తే దుర్వాసన పోయి పైప్స్ క్లీన్ అవుతాయి.
సింక్ దుర్వాసన పోగొట్టడానికి
కార్పెట్‌పై బేకింగ్ సోడా చల్లి గంట తర్వాత వాక్యూమ్ క్లీనర్ చేస్తే దుర్వాసన పూర్తిగా మాయమవుతుంది.
కార్పెట్ దుర్వాసన నివారణ
మాడిపోయిన గిన్నెలలో బేకింగ్ సోడా, నీరు పోసి కాసేపు మరిగిస్తే అడుగున మాపు సులభంగా వదిలిపోతుంది.
మాడిపోయిన పాత్రలు
చెడు వాసన వచ్చే బూట్లు లేదా పర్సులలో కొద్దిగా బేకింగ్ సోడా పొడి చల్లితే దుర్వాసన ఇట్టే తగ్గిపోతుంది.
బూట్లు, పర్సుల వాసన
వెండి వస్తువులపై బేకింగ్ సోడా, నీటి పేస్ట్ రాసి కాసేపు ఉంచి కడిగితే వాటి మెరుపు మళ్లీ వస్తుంది.
నగలు మెరవడానికి
ఎలాంటి హానికారక రసాయనాలు లేకుండా తక్కువ ఖర్చుతో ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి ఇది చక్కటి మార్గం.
సులభమైన చిట్కా