పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి జిల్లాకు నీరు ఇస్తున్నందుకు సూచికగా పాయకరావుపేట వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించిన సీఎం
• మంత్రులు నిమ్మల రామానాయుడు, వంగల పూడి అనిత, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి
• ఎడమ కాలువ నుంచి అనకాపల్లి జిల్లా వరకూ వచ్చిన గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి జల హారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు.
• పాయకరావుపేట వద్ద పోలవరం ఎడమ కాలువ క్రాస్ రెగ్యులేటర్ నుంచి గోదావరి జలాలను ఉత్తరాంధ్ర జిల్లాలకు విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
• ఎడమ కాల్వ ద్వారా విడిచే నీటితో నాలుగు జిల్లాల పరిధిలో 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 9 లక్షల మందికి తాగునీరు ఇచ్చేలా ప్రణాళిక
• ఎడమ కాలువ నిర్మాణానికి రూ.4,192 కోట్ల ఖర్చు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.
• ఎడమ కాలువ ద్వారా వచ్చిన నీటితో అనకాపల్లి వద్ద ఏలేరు కాలువతో పాటు జిల్లాలోని 110 చెరువులను నింపేలా జల వనరుల శాఖ ప్రణాళిక
• గోదావరి జలాలతో పుష్కర ఆయకట్టు పరిధిలో 1.48 లక్షల ఎకరాలు, ఏలేరు కింద 80 వేల ఎకరాలు, పంపా కింద 12 వేల ఎకరాలు, తాండవ, వరహా, మామిడి గెడ్డ ఆయకట్టు పరిధిలో ఉన్న 46,620 ఎకరాల స్థిరీకరణ
• 23.44 టీఎంసీల గోదావరి జలాలతో విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని పారిశ్రామిక అవసరాలకు, తాగు, సాగునీటికి నీరు ఇచ్చేలా ప్రణాళిక
• కూటమి ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి శిలా ఫలకం వద్ద ఫోటోలు దిగిన చంద్రబాబు
• అధికారులు, ప్రజా ప్రతినిధులను స్వయానా పిలిచి శిళాఫలకం వద్ద అందరితోనూ ఫోటోలు దిగిన ముఖ్యమంత్రి
• ముఖ్యమంత్రికి సాంప్రదాయ కోలాటంతో స్వాగతం
ఉత్తరాంధ్ర గడపలో అడుగుపెట్టిన గోదారమ్మకు ప్రణమిల్లి నమస్కారం చేస్తున్నా. మొన్ననే వెలిగొండతో కృష్ణమ్మను తరలించి కరువుపీడిత మార్కాపురంనకు నీళ్లిచ్చాం.
తూర్పు కనుమలను, అడవులను, నదుల్ని, వాగులు, వంకలు, హైవేలను దాటుకుని అన్నవరం సత్యదేవుని ఆశీస్సులతో గోదారమ్మ ఈ ప్రాంతానికి వచ్చింది
వచ్చే ఏడాది సింహాద్రి అప్పన్న చెంతకు గోదారమ్మను తీసుకెళ్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. భవిష్యత్లో అరసవెల్లి సూర్యనారాయణ స్వామి వద్దకు తరలించి వంశధార నదికి అనుసంధానం చేస్తాం
శంకరంబాడి సుందరాచారీ చెప్పినట్లుగా గలగలా గోదారి…బిరబిరా కృష్ణ్మమ్మ పరుగులతో రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తాం : పాయకరావుపేట సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు.











