యశ్ వన్ మెన్ షో గా ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్
తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థలు: KVN ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ LLP
నటీ నటులు : యష్ (ద్విపాత్రాభినయం) కియర అద్వాని,నయన తార,హుమా కురెశి, తార సుతరియా,రుఖ్మిని వసంత్,అక్షి ఒబెరాయ్, డారెల్ డి సిల్వా, సుదేవ్ నాయర్,బాలాజీ మనోహర్,సంజీద షేక్, కైల్ పాల్,బెఅత్రిజ్ తుఫెంబాచ్, సుర్జిత్ గోపీనాథ్,అమిత్ తివారి,బెనెడిక్ట్ గర్రెట్ట్, టేతియన్ గైదార్,హరీష్ భరమగీరి, తది తరులు నటించారు.
సంగీతం : పాటలు – రవి బశ్రుర్, విశాల్ మిశ్ర, తనిష్క్ బాగ్చి, ఫహీం అబ్దుల్లః, అర్సలన్ నిజామి,
నేపధ్య సంగీతం :రవి బశ్రుర్, సినిమాటోగ్రఫీ : రాజీవ్ రవి,
ఎడిటింగ్ : ఉజ్వల్ కులకర్ణి, మాటలు : రాధాకృష్ణ బత్తర్
కథ : యాష్, గీతు మోహన్ దాస్,
నిర్మాతలు : వెంకట్ కే నారాయణ, యాష్,
స్క్రీన్ ప్లే,దర్శకత్వం :గీతు మోహన్ దాస్,
విడుదల తేది: 26.08.2026
నిడివి : 3 ఘంటల 14 నిముషాలు
సినిమా బడ్జెట్ : 500 కోట్ల రూపాయలు
‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్'(Toxic: A Fairy Tale for Grone ups) ‘కేజీఎఫ్ 2’ విడుదలైన నాలుగేళ్ళ తర్వాత పాన్ ఇండియన్ హీరో రాకింగ్ స్టార్ యష్ (Yash),నుంచి వస్తున్న పాన్ ఇండియన్ చిత్రమిది. గ్యాంగ్‌స్టర్ పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన టాక్సిక్‌కు గీతూ మోహన్ దాస్(Geethu Mohan Das) దర్శకత్వం వహించిన సినిమా ఈ సినిమాలో కియారా అడ్వాణీ,(Ksira Adhvani) రుక్మిణీ వసంత్,(Rikhmini Vasanth) తారా సుతారియా,(Tara Suthaariya) హ్యూమా ఖురేషి(Huma Qureshi) హీరోయిన్లు. mariyu యష్ సిస్టర్‌గా నయనతార (Nayanthara) నటించారు. టీజర్, ట్రైలర్, పాటలతో సంచలనం సృష్టించిందీ సినిమా. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కే నారాయణ నిర్మించిన ఈ మూవీని తెలుగులో దిల్‌రాజు రిలీజ్ చేశారు. మరి సినిమా ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.
కథ :
1947, 1967 నేపథ్యంలో ఈ చిత్రం కథ సాగుతుంది. ఇండియాకు ఇండిపెండెన్స్ వచ్చింది. కానీ, గోవాకు రాలేదు. అది పోర్చుగీస్ అధీనంలో ఉంది. అయితే… రాజ్యం మాత్రం సాల్వదార్ చేతిలో ఉంది. గోవాకు సాల్వడర్ (డారెల్ డి సిల్వా) కింగ్‌మేకర్‌గా ఉంటాడు. సాల్వడర్ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు అతడి తమ్ముడు ఫెర్నాండేజ్‌ను చంపి సాల్వడర్‌కు అతడికి కుడి భుజం లాగ దగ్గరవుతారు రాయ. తమ్ముడు రాయ కడుపు నింపడం కోసం అక్క గంగ (నయనతార)తన ఒళ్లు కూడా అమ్ముకుంటుంది. అలాంటి అక్కని ప్రాణంగా చూసుకుంటాడు రాయ. అక్క గంగ సలహాలు, సూచనలతో గోవాను తన చెప్పు చేతల్లో ఉంచుకుంటాడు. రాయ ధీరత్వం చూసి తన కుమార్తె రెబక్కా (తార సుతారియా)ను ఇచ్చి పెళ్లి చేయడానికి సాల్వదార్ సిద్ధమవుతాడు. అయితే సర్కస్ ఆర్టిస్ట్ నాదియా (కియారా అడ్వాణీ)తో ప్రేమలో పడతాడు రాయా. ఈ ప్రేమాయణం వల్ల రెబెకాతో పాటు గంగ ప్రాణాలు కోల్పోతారు. గంగను నాదియానే చంపుతుంది. రెబక్కా, నాడియా తర్వాత రాయా జీవితంలోకి వచ్చిన మెలిశా (రుక్మిణీ వసంత్) ఎవరు? రాయాకు కన్న కొడుకు రూమీ అలియాస్ ‘టికెట్’ ఎందుకు ఎదురు తిరిగాడు? తండ్రి కొడుకుల యుద్ధం చివరకు ఏ తీరానికి చేరింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. సాల్వడర్ తర్వాత అతడి సామ్రాజ్యానికి రాయనే అధిపతి అని అందరూ ఫిక్సవుతారు. ఈ నిజం తెలుసుకున్న రాయ అనుక్షణం ప్రియురాలిపై కోపంతో రగిలిపోతుంటాడు. నాదియాను రాయ మళ్లీ కలుసుకున్నాడా? గంగను నాదియా ఎందుకు చంపింది? అందరూ దూరమైన బాధలో ఉన్న రాయ లైఫ్‌లోకి మెల్లిసా ఎలా వచ్చింది? రాయ సామ్రాజ్యాన్ని కూల్చాలని ప్రయత్నించిన రూమీ (యశ్) ఎవరు? అన్నదే ఈ మూవీ కథ.
నటీ నటుల హవబావలు :
టాక్సిక్‌కు యశ్ వన్ మెన్ షోగా నిలిచాడు. రాయ ,రూమీ రెండు పాత్రల్లో అతడి బాడీలాంగ్వేజ్, మ్యానరిజమ్స్ బాగున్నాయి. యాక్షన్ సీన్లలో అదరగొట్టాడు. అనుక్షణ బాధ, పశ్చాత్తాపంతో రగిలిపోయే గ్యాంగ్‌స్టర్ పాత్రలో చక్కటి వేరియేషన్స్ చూపించాడు. హీరోయిన్ల పాత్రలను బోల్డ్ , డేరింగ్ డాషింగ్‌గా చూపించారు డైరెక్టర్ గీతూ మోహన్ దాస్. రెగ్యులర్ హీరోయిన్ల మాదిరిగా ఎవరూ సాఫ్ట్‌గా కనిపించరు. యశ్ సోదరిగా యాక్షన్ రోల్లో నయనతార కనిపించింది. చాలా వరకు ఎక్స్‌ప్రెషన్స్‌తోనే నటించింది. హీరోయిన్లలో ఎక్కువ హైలైట్ అయ్యింది కియారానే. ప్రేమకు, చేయని తప్పకు మధ్య అనుక్షణం బాధపడే యువతిగా చక్కటి నటనను కనబరిచింది. యశ్ కియారా మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్, ఇంటిమేట్ సీన్లు యూత్ ఆడియెన్స్‌ను మెప్పిస్తాయి. తారా సుతారియా, రుక్మిణి వసంత్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేదు. నెగెటివ్ క్యారెక్టర్లో హ్యూమా ఖురేషి నటన ఒకే.
సాంకేతిక వర్గం పనితీరు :
ముఖ్యంగా నిర్మాతనిర్మాత వెంకట్ కే నారాయణ ను అభినందించాలి ఎక్కడా టాక్సిక్ ఖర్చుకు అసలు వెనుకాడలేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఫ్రేమ్ రిచ్ గా ఉంది. ఈ కథ అంతా1927, 1947 నుంచి 1967 వరకు, అదీ గోవా నేపథ్యంలో కావడంతో ప్రతి సన్నివేశంలో ప్రొడక్షన్ వర్క్ అవసరం అయ్యింది. కొత్త ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకు వెళ్ళడం కోసం ప్రొడక్షన్ డిజైన్ టీమ్, సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవి చాలా కష్టపడ్డారు. తమ 100 శాతం ఎఫర్ట్స్ పెట్టారు. విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి, అయితే… తెలుగులో డైలాగ్స్ రాసిన రాధాకృష్ణ బత్తర్ మనం ఈ కాలం తెలుగు సినిమా చూస్తున్నామా? లేదంటే ఇండిపెండెన్స్ రోజులకు వెళ్లామా? అనే సందేహాన్ని కలిగించారు. అచ్చమైన తెలుగు లో ప్రామాణికం, క్రౌర్యం, అపరాధం వంటి పదాలు విని షాక్ అవ్వాల్సిన పరిస్థితి. కెమెరా వర్క్, బీజీఎం, పాటలు అన్నీ కూడా నెక్ట్స్ లెవెల్లో ఉంటాయి. కానీ కమర్షియల్‌గా ఈ సినిమాకి ఆ రేంజ్ ప్రతిఫలం వస్తుందా? లేదా? అన్నది చూడాలి.
విశ్లేషణ:
కేజీఎఫ్‌తో హీరో యశ్ ఓవర్‌నైట్‌లోనే స్టార్‌గా మారిపోయాడు. హీరోయిజం, ఎలివేషన్లకు కొత్త అర్థాన్ని ఇచ్చింది ఈ మూవీ. కేజీఎఫ్ స్ఫూర్తితో గ్యాంగ్‌స్టర్ సినిమాలు దక్షిణాదిలో చాలా సినిమాలు వచ్చాయి. కానీ తన సినిమానే స్ఫూర్తిగా తీసుకొని యశ్ టాక్సిక్ సినిమా చేశాడు. టాక్సిక్‌లో హీరో క్యారెక్టరైజేషన్, వయలెన్స్, మేకింగ్ అడుగడుగునా కేజీఎఫ్‌ను గుర్తుకుతెస్తాయి. ఐదుగురు మహిళలతో ముడిపడిన ఓ గ్యాంగ్‌స్టర్ జీవితాన్ని భావోద్వేగభరితంగా చూపించేందుకు మంచి ఛాన్స్ ఉంది. పెళ్లిచేసుకున్న భార్య…తోడబుట్టిన అక్క…ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలి జ్ఞాపకాలతో జీవించే ఓ గ్యాంగ్‌స్టర్ లైఫ్‌తో ఈ కథను రాసుకున్నారు. రాతలో ఉన్న ఎమోషనల్ కనెక్టివిటీ తీతలో మిస్సయ్యింది. ఆ దిశగా దృష్టి సారిస్తే యశ్ కెరీర్‌కు మంచి ఛేంజ్ ఓవర్లా ఈ మూవీ నిలిచిపోయుండేది. కథపై కాకుండా కేజీఎఫ్‌తో యశ్‌కు వచ్చిన ఇమేజ్ను దర్శకురాలు ఎక్కువగా ఆధారపడ్డారు. యశ్ కూడా సినిమాలో చాలా స్టైలిష్‌గా కనిపించాడు. తన యాక్టింగ్‌తోనే ఈ సినిమాను లాక్కొచ్చారు. అతడు చెప్పే ప్రతి డైలాగ్ థియేటర్లలో విజిల్స్ వేయిస్తాయి.
క్లైమాక్స్‌లో నట విశ్వరూపం చూపించాడు. రెండు పాత్రల్లో వేరియేషన్ చూపిస్తూ అద్భుత నటనను కనబరిచాడు. క్లైమాక్స్ చూశాక ఇదొక సైకలాజికల్ సబ్జెక్ట్ అని అర్థం అవుతుంది. చివరి అరగంట సైకాలజీ కథకు రెండున్నర గంటల పాటు రొమాన్స్, యాక్షన్ దట్టించి తీసిన మసాలా సినిమా టాక్సిక్. మితిమీరిన రక్తపాతం, అడల్డ్ సీన్లతో ‘టాక్సిక్’లోని ఎమోషన్స్ కనిపించకుండా పోయాయని చెప్పుకోవచ్చు. ఎంత సేపు నరకడం, కాల్చడం, శృంగార సన్నివేశాలే తప్పా..ఒక్క చోట ఎమోషనల్ సన్నివేశాలు పండలేదు.ఈ సినిమాలో యశ్ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్, యాక్షన్ సీన్స్ అభిమానులను ఆకట్టుకునేలా వున్నాయి. మరి ఈ చిత్రంతో యశ్ తన విజయ పరంపరను కొనసాగీస్తాడా ? లేదా? రన్, కమర్షియల్ రిటర్న్స్ ఏ మేరకు వస్తుందో అన్నది వేచి చూడాలి?








