ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకలు.. ఉత్తర అమెరికాలో అక్టోబర్ 10న ఘనంగా నిర్వహణ!
విశాఖపట్నంలోని ప్రఖ్యాత ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఆంధ్ర విశ్వ కళా పరిషత్) శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని, ఉత్తర అమెరికాలో ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకలు(Andhra University Centenary Celebrations, North America) అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.
వేడుకల వివరాలు:
తేదీ , సమయం: అక్టోబర్ 10, 2026 (ఉదయం 8:30 AM నుండి సాయంత్రం 5:30 PM వరకు).
వేదిక: హిల్టన్ గార్డెన్ ఇన్, షుగర్ ల్యాండ్, టెక్సాస్ 77479 (గ్రేటర్ హ్యూస్టన్ ఏరియా).
ఈ చారిత్రక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవనీయులైన వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జి.పి. రాజశేఖర్ విచ్చేయనున్నారు.
వాట్సాప్ గ్రూప్: ఈ వేడుకలకు సంబంధించిన తాజా సమాచారం , అప్డేట్స్ తెలుసుకోవడానికి ఆసక్తి గలవారు https://chat.whatsapp.com/Hx13zw7s5iOBBcaCfAJrPZ లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్‌లో చేరవచ్చు.
RSVP: కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు గూగుల్ ఫారమ్ https://forms.gle/xCECs1BxxQ4EsdRh8 ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలి.
అల్యుమ్ని(Alumni) ప్రత్యేక గుర్తింపు & నామినేషన్లు:
ఉత్తర అమెరికాలో నివసిస్తూ వృత్తిపరంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన, సమాజానికి , తమ మాతృసంస్థ అయిన ఏయూ (AU) అభివృద్ధికి విశేష కృషి చేసిన పూర్వ విద్యార్థులను (Alumni) ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఘనంగా సత్కరించనున్నారు.
అర్హులైన అభ్యర్థుల నామినేషన్ల కోసం https://forms.gle/iSbcrKsfg8Sy3vwi9 గూగుల్ ఫారమ్‌ను ఉపయోగించవచ్చు.
నామినేషన్లు సమర్పించడానికి చివరి తేదీ: సెప్టెంబర్ 15, 2026.
స్పాన్సర్షిప్ వివరాలు:
ఈ చారిత్రాత్మక వేడుక విజయవంతంగా నిర్వహించేందుకు మీ వంతు ఆర్థిక సహకారాన్ని అందించవచ్చు. పన్ను మినహాయింపు ఉండే ఈ విరాళాలను [email protected] కు జెల్లె (Zelle) ద్వారా పంపవచ్చు (మెమోలో ‘AU 100’ అని రాయవలసిందిగా కోరడమైనది).
మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు:
ఫణీంద్ర కొండపి: +1 (434) 426-1939
సాయి రాచకొండ: +1 (281) 235-6641
రవీంద్రనాథ్ దుగ్గిరాల: +1 (210) 326-0806
ప్రసాద్ తాత: +1 (314) 482-3465








