సిలికానాంధ్ర రజతోత్సవాల్లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నాలు
SiliconAndhr: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం, ఓక్లాండ్ అరెనా వేదికగా సిలికానాంధ్ర సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న ‘సిలికాన్ ఆంధ్రా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్’ (రజతోత్సవాలు) జులై 31 నుండి ఆగస్టు 1, 2026 వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా ప్రతిష్టాత్మక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కోసం నిర్వాహకులు కార్యక్రమాలు ముమ్మరం చేశారు. ఈ రజతోత్సవ వేడుకల్లో భాగంగా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పేలా పలు అద్భుతమైన కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
కార్యక్రమాలు..
కుంభ హారతి: 108 మంది నర్తకీమణులు, 108 కలశాలతో దివ్యమైన రీతిలో కుంభ హారతి ప్రదర్శన ఉంటుంది.
సంగీతామృతవర్షిణి: సాంప్రదాయం , ఆత్మను కట్టడి చేసే అద్భుతమైన సంగీత సవ్వడి.
లయ అమృతవర్షిణి: ఉత్సాహాన్ని నింపే , ఐక్యతను చాటే లయ విన్యాసాలు.
కూచిపూడి నాట్యామృతవర్షిణి: శాశ్వత సాంప్రదాయాలను చాటిచెప్పే కూచిపూడి నృత్య ప్రదర్శనలు.
లలితా గీతామృతవర్షిణి: మధురమైన జ్ఞాపకాలను తలపించే గీతాల ఆలాపన.
శతక సంఖారావం: తరాలను ఉత్సాహపరిచే కాలాతీత పద్యాల ప్రదర్శన.
వందే భారతం: ఒకే భారతదేశం – ఒకే హృదయస్పందన అనే నినాదంతో ప్రత్యేక కార్యక్రమం.
దక్ష యజ్ఞం: అద్భుతమైన ఇతిహాస ప్రదర్శన.
జానపద జాతర: నేల స్ఫూర్తిని, ఆత్మను కదిలించే జానపద కళారూపాలు.
తెలుగు సాహిత్య, సాంస్కృతిక వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసే ఈ గొప్ప వేడుకల్లో సంగీత, నాట్య ప్రియులందరూ పాలుపంచుకోవాల్సిందిగా నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు.








